శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం
మహేశ్వరం: మహేశ్వరం జోన్ డీసీపీగా కె.నారాయణరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. తుక్కుగూడలోని డీసీపీ కార్యాలయంలో విధులు ప్రారంభించారు. ఆయనకు మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఏసీపీలు, మహేశ్వరం, కందుకూరు, పహా డీషరీఫ్, ఆదిబట్ల, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీసీపీ మహేశ్వరం జోన్ పరిఽధిలోని ఏసీపీలు, సీఐలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమష్టిగా కృషి చేయాలని అన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో పని చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ఏసీపీలు జానకిరెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.


