లేబర్ కోడ్‌లు అమలు చేయొద్దు
తుర్కయంజాల్: కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌ల అమలుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం తుర్కయంజాల్‌లో సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతనాల కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రతా కోడ్, వృత్తి పరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ను అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన నాలుగు కోడ్‌లు కార్పొరేట్ శక్తులు, పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో సంఘం మున్సిపల్ కన్వీనర్ ఎం.సత్యనారాయణ, మధు, ఆటో యూనియన్ నాయకులు హనుమంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.


