గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌ | - | Sakshi
Sakshi News home page

గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌

Nov 22 2025 8:23 AM | Updated on Nov 22 2025 8:23 AM

గురూజ

గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌

కందుకూరు: మండలంలోని పులిమామిడి పరిధిలోని శ్రీనిఖిల్‌ చేతనా కేంద్రం నిర్వాహకులు బ్రహ్మశ్రీ గురూజీ అనిల్‌కుమార్‌జోషి మిజోరాం ఇక్ఫాయి వర్సిటీ నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. ఆయుర్వేద పరిశోధనలో ఆయన చేసిన అత్యుత్తమ కృషితో పాటు క్యాన్సర్‌ చికిత్సలో రెండు పేటెంట్లు సాధించనందుకు గుర్తింపుగా ఆ వర్సిటీ నిర్వాహకులు ఆయన్ని డాక్టరేట్‌కు ఎంపికచేశారు. గురువారం మిజోరాంలోని ఇక్ఫాయి వర్సిటీ 13వ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్‌ జనరల్‌ వీకే సింగ్‌ ఆయనకు డాక్టరేట్‌ ప్రదానం చేసి సత్కరించారు.

సినీ దర్శకుడు రాజమౌళిపై ఫిర్యాదు

కేశంపేట: సినీ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి హైదరాబాద్‌లో ఓ సినిమా ఈవెంట్‌లో హనుమంతుడిపై చేసిన అనుచిత వాఖ్యలు చేశారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కేశంపేట ఠాణాలో బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి శివాజీ పార్టీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. రాజమౌళి చేసిన వాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ నాయకులు అంజయ్య, నరసింహ, వెంకటేశ్వర్‌జీ, మహేశ్‌, శివగౌడ్‌ తదితరులు ఉన్నారు.

శాంతిభద్రతలకు విఘాతం కలిగించొద్దు

శంషాబాద్‌ డీసీపీ రాజేశ్‌

షాద్‌నగర్‌రూరల్‌: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని శంషాబాద్‌ డీసీపీ రాజేశ్‌ హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఫరూఖ్‌నగర్‌, నాగులపల్లి రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు కార్డెన్‌ సెర్చ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు, కిరాణం, బెల్టుషాపులపై దాడులు చేశారు. 6 బెల్టు షాపు కేసులు, 2 గుట్కా, 10 డ్రంకెన్‌ డ్రైవ్‌, 10 బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న కేసులను నమోదు చేశారు. ఎలాంటి ధ్రువపత్రాలు లేకుండా నడుపుతున్న 24 కేసులు బైక్‌లను సీజ్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాజేశ్‌ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణలో భాగంగా ఈ కార్డెన్‌ సెర్చ్‌ను చేపట్టామని చెప్పారు. నిషేధిత గుట్కాలు విక్రయించే వారిపై, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి సమయాల్లో అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలని, అలాంటి వారు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. బెల్టు షాపులలో మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ తనిఖీల్లో అడిషనల్‌ డీసీపీ పూర్ణచందర్‌, సీఐలు విజయ్‌కుమార్‌, నర్సయ్య, శ్రీనివాసులు, జానకిరాం, గంగాధర్‌, నరహరి, ఎస్‌ఓటీ సీఐ సంజయ్‌, సీసీఎస్‌ సీఐ రవికుమార్‌, డీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్‌ సీఐ చంద్రశేఖర్‌, ఎస్‌బీ ఎస్‌ఐ దేవకి, ఎస్‌ఐలు శరత్‌కుమార్‌, రాంచందర్‌, సుశీల, ప్రణయ్‌, శ్రీకాంత్‌, విజయ్‌, ఏఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రోడ్డుపై కొండచిలువ సంచారం

మొయినాబాద్‌: రాత్రి సమయంలో రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ వాహనదారులను, స్థానికులను భయాందోళనకు గురిచేసిందసింది. మొయినాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట ఉన్న వెల్డింగ్‌ షాపు వద్ద శుక్రవారం రాత్రి కొండచిలువ ప్రత్యక్షమైంది. షాపు నిర్వాహకులు చూస్తుండగానే హైదరాబాద్‌–బీజాపూర్‌ జాతీయ రహదారిపైకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న వాహనదారులతోపాటు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఓ వ్యక్తి కొండచిలువను పట్టుకుని సంచిలో వేశాడు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వచ్చి కొండచిలువను అడవిలోకి తీసుకెళ్లారు. మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో నుంచే కొండ చిలువ బయటకు వచ్చినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఆర్టీసీ కార్గో వస్తువుల బహిరంగ వేలం

సాక్షి, సిటీబ్యూరో: మహాత్మా గాంధీ బస్‌స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కార్గో, పార్సిల్‌ వస్తువులకు శనివారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు హైదరాబాద్‌ జోన్‌ లాజిస్టిక్‌ మేనేజర్‌ బద్రి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిక్‌ వస్తువులు, ఐరన్‌, ద్విచక్రవాహనాలు, కార్ల విడిభాగాలు, కంప్యూటర్‌ విడిభాగాలు, దుస్తులు, ప్లాస్టిక్‌ వస్తువులు, బుక్స్‌, రెగ్జిన్‌ తదితర వస్తువులను వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంజీబీఎస్‌లోని పార్సిల్‌ గోడౌన్‌ ఆవరణలో ఉదయం 10 గంటలకు వేలం ప్రారంభించనున్నారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్నవారు ఫోన్‌: 9391778825, 9154298865 నంబర్ల ద్వారా సంప్రదించవచ్చు.

గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌ 1
1/3

గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌

గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌ 2
2/3

గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌

గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌ 3
3/3

గురూజీ అనిల్‌కుమార్‌జోషికి డాక్టరేట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement