సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం
గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మధుసూదన్‌రెడ్డి
షాబాద్: పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్య మని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మ ధుసూదన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని ఆస్పల్లిగూడలో చిలకల సువర్ణ ఇందిరమ్మ ఇంటిని నిర్మి ంచుకుంది. ఈ మేరకు శుక్రవారం ఆయన గృహప్రవేశానికి హాజరై ఇంటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ ద శల వారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాను క్షేత్రస్ధాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నిక ల్లో సత్తా చాటేందుకు సమష్టిగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కా వలి చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యులు చెన్న య్య, అశోక్, మాజీ సర్పంచ్‌లు ప్రతాప్‌రెడ్డి, మహే ందర్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌నాయక్, నా యకులు ప్రభాకర్‌రెడ్డి, ఆంజనేయులు, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్, రాహుల్, సూర్యగౌడ్, రమేశ్, గౌరీ శ్వర్, కృష్ణారెడ్డి, మహేశ్, శేఖర్, తదితరులున్నారు.
చెక్కుల పంపిణీ
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ పండ్ పథకాలు పేదలకు మేలు చేకూరుస్తాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో 33 మంది లబ్ధిదారులకుకల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 11 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
శంకర్‌పల్లి: పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తోందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ పరిధిలోని 2వ వార్డుకి చెందిన ఆరెగూడెం మీన దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులందరూ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యోగేశ్, నాయకులు ప్రవీణ్, గోపాల్‌రెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రమౌలి, రాజశేఖర్‌రెడ్డి, రఘునందన్‌రెడ్డి పాల్గొన్నారు.
మందు బాబులకు
జైలు శిక్ష, జరిమానా
శంషాబాద్ రూరల్: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులుపించారు. ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ విభాగం వారు నమోదు చేసిన కేసుల్లో కోర్టు 9 మందికి శిక్షతో పాటు జరిమానా విధించింది. మద్యం సేవించి వాహన నడిపిన మైస్యకు రెండు రోజుల సాధారణ కారాగార శిక్ష, రూ. 3 వేల జరిమానా, మహేష్‌కు రెండు రోజుల సాధారణ కారాగార శిక్షతో పాటు రూ. 2,500 జరిమానా విదిస్తూ రాజేంద్రనగర్ 10 స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఎం.శోభ ఆదేశాలు జారీ చేశారు. మరో ఇద్దరికి రూ. 5,500 జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపిన ఐదు మందికి రూ. 7,500 జరిమానా పడింది. రహ దారి భద్రతను నిర్ధారించడం, ట్రాఫిక్ నియ మాలను కఠినంగా అమలు చేస్తామని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.ప్రమోద్‌కుమార్ తెలిపారు.


