బీజేపీని విమర్శించే స్థాయి కవితది కాదు
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి
కేశంపేట: కేంద్రంలో బీజేపీ పార్టీని విమర్శించే స్థాయి కల్వకుంట్ల కవితది కాదని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రిపుల్ ఆర్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులను అందిస్తూ రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తోందన్నారు. ఇది జీర్ణించుకోలేకే కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోందన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి రోడ్ల అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూస్తున్న ప్రజలు స్ధానిక ఎన్నికలతో పాటుగా మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఆదరించి, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ పసుల నర్సింహయాదవ్, అంజయ్య, మహేశ్, నర్సింలు, నరేందర్‌రెడ్డి, ఉదయ్‌గౌడ్, ముల్తూంకార్ శివాజీ, కుమారస్వామి, మహేశ్, తలసాని పవన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వందేమాతరం మహోత్సవాలు
ప్రతీ ఒక్కరు దైవ భక్తితో పాటు దేశభక్తిని పెంపొందించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పా లమూరు విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వందేమాతరం–150 ఏళ్ల మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ నా యకులు విద్యార్థులతో కలిసి వందేమాతరం గీతా న్ని ఆలపించారు. అనంతరం విష్ణువర్ధన్‌రెడ్డి మా ట్లాడుతూ.. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత వందేమాతరం గీతాన్ని గీతాన్ని జాతీయ గీతంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. దేశరక్షణ కు యువత ముందుకురావాలని కోరారు. బీజేపీ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ నర్సింహయాదవ్, అంజయ్య, ఉదయ్‌కుమార్‌గౌడ్, యుగేందర్, నర్సి ంలు, మహేశ్, అశోక్, నరేందర్‌రెడ్డి, పవన్‌కుమార్ రెడ్డి, కుమార్, వెంకటేశ్వర్‌జీ, మహేశ్, సందీప్‌గౌడ్, శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


