భూ నిర్వాసితులకు న్యాయం చేస్తా
కడ్తాల్: గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న మర్రిపల్లి, ఎక్వాయిపల్లి భూ నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, న్యాయం జరిగేలా చూస్తానని, తగిన పరిహారం అందించేందుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ, కందుకూరు, కడ్తాల్ మండలాల మీదుగా ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు ప్రభుత్వం గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మించనున్న విషయం విదితమే. ఈ మేరకు మండల పరిధిలోని ఎక్వాయిపల్లి, మర్రిపల్లి గ్రామాల భూ నిర్వాసితులు శుక్రవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. భూమికి భూమి పరిహారంగా ఇవ్వాలని, లేని పక్షంలో కొంగరకలాన్, రావిర్యాలలో ఇచ్చిన విధంగా పరిహారం ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ప్రభుత్వంతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ వీరయ్య, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికాంత్‌గౌడ్, రైతులు కరుణాకర్, వెంకట్‌రెడ్డి, సుమన్, నారాయణ, పాండురంగారెడ్డి, చెన్నయ్య.శంకరయ్య, పాండు, మల్ల య్య, హరీశ్, రమేశ్ తదితరులు ఉన్నారు.
కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి


