17 ఏళ్ల తర్వాత కేసు కొట్టివేత
షాద్‌నగర్: జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అన్నందుకుగాను బీజేపీ నేతలపై నమోదైన కేసును 17 ఏళ్ల తర్వాత షాద్‌నగర్ కోర్టు కొట్టి వేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాబ్రీ మసీదును కూల్చివేత దినోత్సవాన్ని పురస్కరించుకొని 2008 డిసెంబర్ 6న బీజేపీ నేతలు షాద్‌నగర్ పట్టణంలో వీరశౌర్య దివస్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. దీంతో అప్పట్లో వీరశౌర్య దివస్ కార్యక్రమంలో పాల్గొన్న వనం ఝాన్సీ, నేతలు శ్రీవర్ధన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, నందిగామ వెంకటేష్, అశోక్‌గౌడ్, కక్కునూరి వెంకటేష్‌గుప్తా, నర్సింహాగౌడ్, బల్వంత్‌రెడ్డి, వెంకటేష్, రాఘవులు, వెంకటేష్‌యాదవ్, కుమార్, శ్రీరాంయాదవ్, కొండల్‌రెడ్డి, వీరాంజనేయులురెడ్డి, ఖాజన్నగౌడ్‌లపై షాద్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 17 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కోర్టులో కేసు కొనసాగింది. గురువారం మరోసారి విచారణ కోర్టులో కేసు విచారణకు వచ్చింది. దీంతో కేసు నమోదైన వారిలో వనం ఝాన్సీ, వీరాంజనేయులురెడ్డి మృతి చెందడంతో మిగతా 14 మంది నేతలు కోర్టుకు హాజరయ్యారు. విచారణ చేపట్టిన జడ్జి బీజేపీ నేతలపై నమోదైన కేసును కొట్టివేస్తూ తీర్పును ఇచ్చారు. దీంతో బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.


