సైకిల్‌ను ఢీకొట్టిన టిప్పర్
యాచారం: టిప్పడర్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఠాణా పరిధిలోని శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఆకులమైలారం గ్రామానికి చెందిన గండికోట యాదయ్య ఉదయం గ్రామం నుంచి సైకిల్‌పై పనికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న టిప్పర్ సైకిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాదయ్య రెండు కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. కేసు దర్యాప్తులో ఉంది.
గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ ఠాణా పరిధిలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిద్యాదర్ సేతి, భార్య సంగమిత్ర సేతి(28) జల్‌పల్లి శ్రీరాం కాలనీకి వలస వచ్చారు. భర్త స్థానికంగా సింగానియా ఫుడ్స్ కంపెనీలో మెకానిక్‌గా పని చేస్తుండగా, భార్య ఖాజాగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంది. రోజు మాదిరిగానే ఈ నెల 19న బిద్యాదర్, సంగమిత్రలు తమ విధులకు వెళ్లారు. సంగమిత్ర ఎంతకూ ఇంటికి రాకపోవడంతో, ఆమె ఆచూకీ కోసం ఎక్కడ వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో గురువారం రాత్రి బిద్యాదర్ పోలీసులను ఆశ్రయించాడు. పుష్పేందర్ సింగ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేశాడు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లోనైనా సమాచారం ఇవ్వాలన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.


