ఎంపీహెచ్‌డబ్ల్యూలో మహిళలకు ఉచిత శిక్షణ
ఎంపీహెచ్‌డబ్ల్యూలో మహిళలకు ఉచిత శిక్షణ
మొయినాబాద్: జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ మైనార్టీ మహిళలకు ఎంపీహెచ్‌డబ్ల్యూ(మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్) కోర్సుల్లో రెండేళ్ల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం(మహిళా ప్రాంగణం) జిల్లా మేనేజర్ శైలకుమారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మున్సిపల్ పరిధిలోని చిలుకూరులో ఉన్న మహిళా ప్రాంగణంలో ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై 18 ఏళ్లు నిండిన మహిళలు రూ.200 డీడీ చెల్లించి మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. టెన్త్, ఇంటర్ మెమో, స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, రెండు పాస్ ఫొటోలు దరఖాస్తుకు జతచేయాలని చెప్పారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 25 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 76600 22523/24 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మహేశ్వరం డీసీపీగా వికారాబాద్ ఎస్పీ
మహేశ్వరం: మహేశ్వరం డీసీపీగా కె.నారాయణరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ డీసీపీగా పనిచేసిన డి.సునీతారెడ్డిని వనపర్తి జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసింది. వికారాబాద్ ఎస్సీగా విధులు నిర్వహిస్తున్న కె.నారాయణరెడ్డి మహేశ్వరం జోన్ డీసీపీగా రానున్నారు. గతంలో ఆయన శంషాబాద్ జోన్, భువనగిరి డీపీసీగా విధులు నిర్వర్తించారు.
నవజాత శిశువుపైజాగ్రత్తలు తప్పనిసరి
మీర్‌పేట: అప్పుడే పుట్టిన నవజాత శిశువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాలని జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ (టీకా అధికారి) డాక్టర్ షెబాహయత్ సూచించారు. న్యూ బార్న్ వీక్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మీర్‌పేటలోని బాలాపూర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవజాతి శిశువులు, తల్లులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి లోపాలను వివరించి మందులు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ షెబా హయత్ మాట్లాడుతూ.. శిశువుకు పాలు పట్టిన తరువాత కాసేపు భుజాన వేసుకోవాలని, 2–3 గంటలకు ఒకసారి అంటే రోజుకు కనీసం 12 సార్లు పాలు పట్టాలని సూచించారు. తల్లి పాలు ఇస్తే జాండిస్‌కు కారణమయ్యే బిలురుబిన్ యూరిన్‌లోనే కొట్టుకుపోతుందని వివరించారు. మొదటి సంవత్సరంలోనే సరైన సమయంలో టీకాలు వేయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి గీత, వైద్యాధికారి బాలమణి, సిబ్బంది కమలకుమారి, రాజేందర్ పాల్గొన్నారు.
‘కామారెడ్డి డిక్లరేషన్’ అమలు చేయాలి
జిల్లా టీకా అధికారి షెబాహయత్
బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్ యాదవ్
తుక్కుగూడ: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ జి.మల్లేశ్ యాదవ్ డిమాంఆడ్ చేశారు. శుక్రవారం కామారెడ్డి డికర్లేషన్ అమలు చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కలిపించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్లు పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు ఏడాది నుంచి ప్రకటించి.. పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం బీసీలను మోసం చేయడమే అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య, నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్‌గౌడ్, రవీందర్‌గౌడ్, పర్వతాలు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
1/2
ఎంపీహెచ్‌డబ్ల్యూలో మహిళలకు ఉచిత శిక్షణ
2/2
ఎంపీహెచ్‌డబ్ల్యూలో మహిళలకు ఉచిత శిక్షణ