యాచారం పీఏసీఎస్ చైర్మన్‌గా రాజేందర్‌రెడ్డి
యాచారం: హైకోర్టు ఉత్తర్వుల మేరకు యాచారం పీఏసీఎస్ చైర్మన్‌గా రాజేందర్‌రెడ్డి శుక్రవారం మరోమారు బాధ్యతలు చేపట్టారు. రెండు నెలల క్రితం సర్కార్ చైర్మన్ బాధ్యతల నుంచి రాజేందర్‌రెడ్డితో పాటు పాలకవర్గాన్ని తొలగించింది. వీరు హైకోర్టును ఆశ్రయించడంతో వీరికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ మేరకు డీసీఓ సి.సుధాకర్ యాచారం పీఏసీఎస్ చైర్మన్‌గా రాజేందర్‌రెడ్డితో మరో 8మంది బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వులు ఇచ్చారు. రుణాలు పొంది సకాలంలో చెల్లించకుండా డిఫాల్టర్‌గా మిగిలిన నలుగురు సభ్యులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


