మహిళా రక్షణలో ప్రభుత్వాలు విఫలం
ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత
చేవెళ్ల: మహిళలకు రక్షణ కల్పించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యురాలు మమత ఆరోపించారు. పట్టణ కేంద్రంలో గురువారం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా గర్‌ల్స్ కన్వెన్షన్ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. షీ టీమ్స్ ఎక్కడా సక్రమంగా పని చేయడం లేదన్నారు. మహిళలపై హత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, వీటిని అరకట్టడంలో ప్రభుత్వాలు విఫలం చెందాయన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేరాలు, ఘోరాలు పెరిగి పోయాయన్నారు. విద్యార్థుల సమస్యలను గాలికి వదిలేశారన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకు వచ్చి విద్యాభివృద్ధిని అడ్డుకోవటం సరికాదన్నారు. మహిళల కోసం ప్రభుత్వాలు ప్రత్యేక రక్షణ చట్టాలు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కన్వెన్షన్ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. జిల్లా గరల్స్ కమిటీ కన్వీనర్‌గా అంబిక, కో–కన్వీనర్‌గా కీర్తన, కమిటీ సభ్యులుగా అమ్ములు, అక్షిత, మానస, నందిని, నవమి, మౌనిక, ప్రియా ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రణయ్, శంకర్, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, తరంగ్, నాయకులు అరుణ్‌కుమార్, సింధు, శ్రీనివాస్, చరణ్‌గౌడ్, వంశీ, ఇర్మాణ్, చందు, యశ్వంత్, పవన్‌కుమార్, విష్ణు, నవీన్, విష్ణుగుప్తా, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


