విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి అవసరం
బడంగ్‌పేట్: మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలను పెంపుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అన్నారు. గురువారం బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్‌గుల్ ఎంవీఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫుయెల్ సంస్థ, సీజీఐ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో ఎంపవరింగ్ యూత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా బాలకిష్టారెడ్డి, కాలేజ్ అధ్యక్షుడు పీవీఆర్ కాశ్యప్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి చాలా అవసరమన్నారు. విద్యాసంస్థలు–పరిశ్రమల సహకారంపై అవగాహన కల్పించారు. మార్కెటింగ్ లక్ష్యాలను తెలుసుకొని విద్యార్థులు భాగస్వామ్యం కావాలన్నారు. సమగ్ర శిక్షణను విద్యార్థులకు అందించేందుకు ఎంవీఎస్‌ఆర్ తీసుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో డా.ఎం.కామేశ్వర్‌రావు, కె.సర్వేశ్, జ్యోతి శైలేంద్ర, డా.నందితారాజ్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి


