గుండెపోటుతో అయ్యప్ప భక్తుడి మృతి
శంకర్‌పల్లి: శబరిమలలో గురువారం ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండపైకి పాదయాత్ర చేస్తూ వెళ్తుండగా అయ్యప్ప భక్తుడికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్‌కి చెందిన గుంతల మల్లికార్జున్ రెడ్డి(40) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకి భార్య, 13 ఏళ్ల ఇద్దరూ కవల కూతుళ్లు ఉన్నారు. అయితే 41 రోజుల అయ్యప్పస్వామి మాలధారణ అనంతరం ఇరుముడితో ఈనెల 18న 40మంది బృందం బస్సులో శబరిమలకి బ యలుదేరింది. గురువారం అక్కడికి చేరుకున్న బృందం, అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం మార్గమధ్యలో ఉండగా.. మల్లికార్జున్‌రెడ్డికి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కూప్పకూలిపోయాడు. తోటి భక్తులు పైకి లేచి చూడగా.. అప్పటికే మృతి చెంది ఉన్నాడు.


