శరవేగంగా రహదారి పనులు
చేవెళ్ల: పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. చేవెళ్ల, మొయినాబాద్ మండలాల్లో జరుగుతున్న రోడ్డు పనులను బుధవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. రోడ్డు పనులు జరుగుతున్న తీరును, నాణ్యత గురించి కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఈరోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఎలాంటి ఇబ్బందులున్నా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ రోడ్డు పూర్తయితే చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొండగల్ నియోజకవర్గాలతోపాటు బీజాపూర్ వరకు వెళ్లే వారికి సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. చేవెళ్ల, మొయినాబాద్ బైపాస్ రోడ్డు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని, త్వరలో పూర్తవుతాయన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, వెంకట్‌రెడ్డి, పెంటయ్యగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, వీరరేందర్‌రెడ్డి, గోనే ప్రతాప్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, పాండు, మధుసూదన్‌గుప్తా తదితరులు ఉన్నారు.
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


