వివాదాలకు తావివ్వొద్దు
● ప్రణాళిక ప్రకారం ఇందిరమ్మ చీరల పంపిణీ జరగాలి
● కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: వివిదాలకు తావు లేకుండా ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. కోటి మందికి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. మహిళా సమాఖ్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. పంపిణీపై స్థానిక ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వరకు పంపిణీ చేయాలని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, డీఆర్‌డీఓ, మెప్మా పీడీ, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


