ప్రైవేట్ బడుల్లో ఫీజు రాయితీ ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని టీడబ్ల్యూజేఎఫ్ రంగారెడ్డి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గణేష్, ప్రధాన కార్యదర్శి సైదులు మాట్లాడుతూ.. ప్రైవేట్ బడుల్లో జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వడంలో యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. జర్నలిస్టులకు నూతన అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని తెలిపారు. హెల్త్‌కార్డులు జారీ చేయాలని చెప్పారు. పై విషయాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, మణికుమార్, రాందాస్, జిల్లా సహాయ కార్యదర్శులు ప్రభాకర్, నర్సింహ, నేషనల్ కౌన్సిల్ సభ్యులు దేవేందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఖాజా పాషా, శ్రీనివాస్, యాదగిరి, జగన్, రాఘవేందర్, నరేష్, రాజు, నర్సింహ, సురేందర్, గోపాల్, శ్రీరాములు, నర్సింహారెడ్డి, ఆంజనేయులు, సాయినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్


