రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఇబ్రహీంపట్నం: ‘యువజన ఉత్సవాలు–2025’ పోటీల్లో సాహిత్య, సాంస్కృతిక విభాగాల్లో రాణించి రాష్ట్రస్థాయి పోటీలకు తమ విద్యార్థులు ఎంపికై నట్లు ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాధిక, సాంస్కృతిక విభాగాల కన్వీనర్ రాకేశ్‌భవాని తెలిపారు. కథా రచనల్లో టీనా కుమారి(బీఎస్సీ, ప్రథమ సంవత్సరం) ప్రథమ, సాయి కృప(బీకాం, ప్రథమ సంవత్సరం) ద్వితీయ, చిత్ర లేఖనంలో రజిత(బీకాం, ప్రథమ సంవత్సరం) ద్వితీయ బహుమతులను సాధించినట్లు చెప్పారు. ఈ సందర్బంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సురేష్, అధ్యాపకులు, సిబ్బంది రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు.


