ప్రజా సమస్యలపై పోరాటం
మొయినాబాద్: పేదల పక్షాన ప్రజా సమస్యలపై పోరాడేది కమ్యూనిస్టులేనని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పాశ్య పద్మ అన్నారు. సీపీఐ వందేళ్ల ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న ప్రచార జాత మంగళవారం రాత్రి మొయినాబాద్‌కు చేరుకుంది. కళా ప్రదర్శనలు నిర్వహించి కమ్యూనిస్టులు చేస్తున్న పోరాటాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందేళ్లుగా సీపీఐ పార్టీ పేదలు, బడుగులు, కార్మికులు, కర్షకుల పక్షాన అనేక పోరాటాలు చేసిందన్నారు. చట్టసభల్లో సీట్లు లేకున్నా నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తున్నామన్నారు. ఈ నెల 26న ఖమ్మంలో జరిగే సీపీఐ వందేళ్ల ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు ప్రభులింగం, సత్యనారాయణ, మంజుల, అంజయ్య, సుధాకర్, శ్రీనివాస్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మ


