ఇక్ఫాయ్‌లో సాంస్కృతిక వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ఇక్ఫాయ్‌లో సాంస్కృతిక వేడుకలు

Nov 20 2025 9:53 AM | Updated on Nov 20 2025 9:53 AM

ఇక్ఫాయ్‌లో సాంస్కృతిక వేడుకలు

ఇక్ఫాయ్‌లో సాంస్కృతిక వేడుకలు

చేవెళ్ల: శంకర్‌పల్లి మండలంలోని దొంతన్‌పల్లి సమీపంలోని ఇక్ఫాయ్‌ లా స్కూల్‌లో బుధవారం వార్షిక సాంస్కృతిక దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌కు చెందిన మోరాకి కల్చరల్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఈ సంబరాలు సందడిగా జరిగాయి. ఈ సందర్భంగా లా స్కూల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పూజారి రవిశేఖర రాజు, డీన్‌ డాక్టర్‌, వై.ప్రతాప్‌రెడ్డి, యాంకర్‌ అంజలి జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కళ, సృజానాత్మకతల సమ్మేళనంగా విద్యార్థులు, ప్రొఫెసర్లు, అతిథులను ఒకే వేదికపై తీసుకువచ్చి నిర్వహించిన ఈ ప్రదర్శనలు ఉత్సహభరితంగా సాగాయి. కార్యక్రమంలో మోరాకి కల్చరల్‌ క్లబ్‌ ఫ్యాకల్టీ కో–ఆర్డినేటర్‌ డాక్డర్‌ రేణుబాలా, అసిస్టెంట్‌ డీన్‌ డాక్టర్‌ అరుణ్‌కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement