● ఆవేదన
● ఆందోళన
ఇబ్రహీంపట్నం చెరువులోకి భారీగా నీరు రావడంతో ఉప్పరిగూడ రైతుల పంటలు నీటమునిగాయి. బీఆర్‌ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, గోపాల్, నర్సింలు పంటలను పరిశీలించారు. పెద్దవాగు, రాచకాలువ పారి 40 మంది రైతులకు చెందిన 80 ఎకరాల పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే రైతులను పంట నష్టపరిహారంఅందజేయాలని డిమాండ్ చేశారు. – ఇబ్రహీంపట్నం రూరల్
ముద్వీన్ జెడ్పీహెచ్‌ఎస్‌లో మూడు నెలలుగా భౌతిక, రసాయన శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు లేక ఇబ్బంది పడుతున్నామని 8,9,10 తరగతుల విద్యార్థులు మంగళవారం రహదారిౖపైబెఠాయించారు. ఎంఈఓ, డీఈఓలకు సమస్యను వివరించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకుడు నరేశ్ అక్కడకు చేరుకుని సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని విద్యార్థులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. – కడ్తాల్
● ఆవేదన


