వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
కొందుర్గు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఓ ఎంపీటీసీ మాజీ సభ్యుడు మృతి చెందాడు. ఎస్‌ఐ రవీందర్ నాయక్ తెలిపిన ప్రకారం.. మ ండల పరిధిలోని వెంకిర్యాలకు చెందిన కలాల్ మాసయ్యగౌడ్(60) సో మవారం తన టీవీఎస్ మోటార్ సైకిల్‌పై పొలం నుంచి ఇంటి వస్తుండ గా కొల్లూరు–వెంకిర్యాల మార్గంలో ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో తీవ్రంగా గాయపడిన మాసయ్యగౌడ్‌ను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం పరిస్థితి విష మి ంచి మంగళవారం మృతి చెందాడు. మృతుడి సోదరుడి కుమారుడు ఆనంద్‌గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
వీధి కుక్కను ఢీకొట్టి..
యాచారం: వీధి కుక్కను ఢీకొట్టిన ద్విచక్రవాహనదారుడు చికిత్ప పొందుతూ మృతి చెందాడు. సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని చౌదర్‌పల్లికి చెందిన అజ్జు(40) సోమవారం రాత్రి 10.30గంటలకు తన బైక్‌పై చీదేడ్‌లో అత్తారింటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో గడ్డమల్లయ్యగూడ సమీపంలో వీధి కుక్కను ఢీకొట్టాడు. క్షతగాత్రుడిని ఇబ్రహీంపట్నంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఆసియా, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
దొరకని కొండ చిలువ జాడ
తుర్కయంజాల్: పురపాలక సంఘం పరిధి కమ్మగూడలోని న్యూ సుభాష్ నగర్ కాలనీలో సోమవారం స్థానికలు కంటపడి కలకలం రేపిన కొండ చిలువ కోసం మంగళవారం అటవీ శాఖ, మున్సిపల్ అధికారులు వెతికినా ఫలితం లేకపోయింది. పరిసరాలను శుభ్రం చేయించి, ట్రాక్టర్‌తో దున్నించినా దాని జాడ తెలియలేదు. స్థానికులకు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.


