స్పందిస్తున్న మానవతావాదులు | - | Sakshi
Sakshi News home page

స్పందిస్తున్న మానవతావాదులు

Oct 30 2025 7:49 AM | Updated on Oct 30 2025 7:49 AM

స్పందిస్తున్న మానవతావాదులు

స్పందిస్తున్న మానవతావాదులు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్వగ్రామంలో పనులు లేక ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లిన వలసకూలి ఎల్లారెడ్డిపేటకు చెందిన బాలమహేందర్‌ అనారోగ్యంతో కోమాలోకి వెళ్లి ఆస్పత్రిపాలయ్యాడు. బాధితుడి చికిత్సకు దాతలు ముందుకొస్తున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో బుధవారం ‘పతి భిక్ష పెట్టండి’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి మా నవతావాదులు స్పందిస్తున్నారు. మూడు నెలలుగా కోమాలోనే ఉండగా.. కంపెనీ యాజ మాన్యం దాదాపు రూ.50 లక్షల వరకు ఖర్చు చేసి చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో బుధవారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. తన భర్తను కాపాడాలని బాలమహేందర్‌ భార్య సంధ్య కోరడంతో దాతలు ఆర్థికసాయం అందిస్తున్నారు. దాతలు 96400 48582, 95731 18869 నంబర్లలో సాయం చేయాలని బాలమహేందర్‌ భార్య వేడుకుంటుంది.

రైస్‌మిల్లులో పేలిన బాయిలర్‌

సుల్తానాబాద్‌రూరల్‌(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లి శివారులోని కనుకదుర్గా రైస్‌మిల్లులో బుధవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు బాయిలర్‌ పేలి ఇద్దరు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి. మిల్లు షెడ్‌ ధ్వంసమైంది. మిల్లు యాజమాని, కూలీలు కథనం ప్రకారం.. ధాన్యాన్ని పోస్తున్న క్రమంలో ప్రమాదశాత్తు బాయిలర్‌ ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి యంత్రపరికరాలు ధ్వంసమయ్యాయి. షెడ్డు కుప్పకూలింది. అక్కడ పనిచేస్తున్న కూలీలు సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని మార్కెండేయకాలనికి చెందిన గంగరాపు కుమార్‌, శాసీ్త్రనగర్‌కు చెందిన రామస్వామికి తీవ్రగాయాలయ్యాయి. వారిని వెంటనే కరీనంగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఘటనలో దాదాపు రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం వాటిల్లిందని యాజమాని వాపోయారు. ఎస్సై అశోక్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఘటనపై ఆరా తీశారు. ఏసీపీ కృష్ణకు ఫోన్‌చేసి ప్రమాదానికి గల కారాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కూలీలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలని ఏఐటీయూసీ జిల్లా జనరల్‌ సెక్రటరీ కడారి సునీల్‌, మండల కన్వీనగర్‌ తాండ్ర అంజయ్య డిమాండ్‌ చేశారు.

బల్హార్షా–విజయవాడ మధ్య రైళ్ల రద్దు

రామగుండం: మోంథా తుపాన్‌ ప్రభుత్వంతో బల్హార్షా – విజయవాడ మధ్య నడిచే కొన్ని రైళ్లను బుధవారం రద్దు చేశారు. భారీవర్షాలతో పలుచోట్ల ట్రాక్‌ల కింద మట్టి కొట్టుకుపోయింది. గ్రాండ్‌ట్రంక్‌ మార్గంలోని రైళ్లను నిలిపివేశా రు. రామగుండం నుంచి రాకపోకలు సాగించే రద్దయిన, దారిమళ్లించిన రైళ్లు..

● సికింద్రాబాద్‌–సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌ (17233/34 – భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌): బుధ, గురువారాల్లో రద్దు

● విశాఖపట్నం–న్యూఢిల్లీ(20834–ఏపీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌): రీషెడ్యూల్‌ చేశారు. ఐదు గంటలు ఆలస్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement