ఇంటిని కూల్చి.. స్థలాన్ని ఆక్రమించి..
ఒంగోలు టౌన్: ఇరవై ఏళ్లుగా నివసిస్తున్న ఇంటిని నగర పాలక సంస్థ అధికారులు, తాలుకా పోలీసులతో కలిసి టీడీపీ నాయకుడు అక్రమంగా కూల్చివేశాడని ఆరోపిస్తూ నగరంలోని నెహ్రూ నగర్ కాలనీకి చెందిన ఈద జాస్మిన్, విజయ్ దంపతులు దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ మాట్లాడుతూ.. హోటళ్లలో పనిచేసుకుంటూ పొట్టపోసుకుంటున్న నిరుపేద దళిత కుటుంబానికి చెందిన జాస్మిన్, విజయ్ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో రేకుల షెడ్డు వేసుకొని జీవనం సాగిస్తున్నారని తెలిపారు.
టీడీపీ నాయకుడు పసుపులేటి శ్రీనివాసులు అనే వ్యక్తి ప్రభుత్వ భూమిని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆరోపించారు. నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటరావుతోపాటు తాలుకా పోలీసులతో కుమ్మకై ్కన పసుపులేటి శ్రీనివాసరావు నవంబర్ 28వ తేదీన కుట్ర పూరితంగా దళితుడి ఇంటిని కూలగొట్టించారని ఆరోపించారు. డాక్యుమెంట్లు చూపించాలని అడిగితే పోలీసులు కేసు పెడతామని బెదిరించడం దుర్మార్గమన్నారు. ఇంటి కూల్చివేతకు పాల్పడిన, అందుకు సహకరించిన వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఽనిరసనలో దళిత నాయకులు ఎం.వెంకట్, గణేష్, ఓ.కృష్ణ, సీహెచ్ స్రవంతి, మల్లికార్జున, సుప్రియ, చప్పిడిరాణి, బాలమ్మ, చెన్నమ్మ, కమలమ్మ, మరియమ్మ, వెంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు, మార్కాపురంలో టీడీపీ నాయకుల బరితెగింపు
ఒంగోలు నెహ్రూనగర్‌లో దళితుడి ఇల్లు కూల్చివేత
మార్కాపురం మండలం దరిమడుగులో అంబేడ్కర్ విగ్రహ స్థలానికి కంచె
ఇంటిని కూల్చి.. స్థలాన్ని ఆక్రమించి..


