టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా క్రాంతికుమార్
ఒంగోలు సిటీ: టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా వైఎస్సార్ సీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్ నియమితులయ్యారు. తనకు ఈ అవకాశం కల్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డికి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబుకు క్రాంతికుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
మద్దిపాడు: మండలంలోని గుండ్లాపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి కందుల స్టీఫెన్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యాడు. ఇతను జనవరి నెలలో రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటాడు. అదేవిధంగా అండర్ 14 బాలికల విభాగంలో కుంచాల దీపిక, తలకాయల హర్ష రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రకాశం జిల్లా జట్టును ద్వితీయ స్థానంలో నిలబెట్టడానికి కృషి చేశారు. వీరిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మండవ ప్రభాకర్, పీడీలు మాధవి లత విజయ్ కుమార్ పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది అభినందించారు.
● వచ్చే ఏడాది వెలుగొండ పూర్తి చేయాలి
● పదేళ్లపాటు ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించాలి
● పశ్చిమ ప్రకాశం విద్యావంతుల, మేధావుల వేదిక డిమాండ్
మార్కాపురం టౌన్: నూతనంగా ఏర్పాటు చేసే మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలాన్ని కలిపి పదేళ్లపాటు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో పాటు వచ్చే ఏడాదిలోపు వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసి నీటిని అందించాలని పశ్చిమ ప్రకాశం విద్యావంతుల మేధావుల వేదిక ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నూతన మార్కాపురం జిల్లాలో దర్శి నియోజకవర్గం లేకపోవడంతో అందరూ నిరాశ చెందుతున్నారని అన్నారు. రాజధాని స్థాయి కలిగిన దొనకొండను మార్కాపురంలో కలపాలని డిమాండ్ చేశారు. తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. 1973లో నాగార్జునసాగర్ కుడికాలువను మార్కాపురం ప్రాంతానికి తీసుకునిరావాలని ఉద్యమాలు చేసినప్పటికీ ఈ ప్రాంతానికి నీరివ్వకుండా దర్శి, కురిచేడు ప్రాంతాలకు తీసుకెళ్లి అన్యాయం చేశారన్నారు. 1971లో కర్నూలు జిల్లాలో భాగమైన మార్కాపురం డివిజన్‌ను కలుపుతూ ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేసినప్పుడు బడ్జెట్‌లో 19 శాతం నిధులు కేటాయిస్తామని ఆనాడు చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారని నేటికీ నెరవేరలేదన్నారు. 2014 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో రాజధాని ఎంపికలో శివరామకృష్ణ కమిటీ దొనకొండ రాజధానికి అనుకూలంగా ఉంటుందని నివేదిక ఇచ్చినప్పటికీ చేయకుండా అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను ప్రభుత్వం గుర్తించాలని ప్రతినిధులు ఓఏ మల్లిక్, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అన్నపురెడ్డి వీరారెడ్డి, అందె నాసరయ్య, దేవిరెడ్డి నాగేంద్రుడు, ఎం ప్రసాద్, జె మధుసూధనరావు డిమాండ్ చేశారు.
టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా క్రాంతికుమార్
టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ మెంబర్‌గా క్రాంతికుమార్


