బాబు పాలనలో భరోసా శూన్యం
కొనకనమిట్ల:
చంద్రబాబు పాలనలో ప్రజలకు భరోసా శూన్యమని, పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంలో నిర్మించేందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా సోమవారం సాయంత్రం కొనకనమిట్ల మండలంలోని సిద్ధవరం, కాట్రగుంట గ్రామాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 5 పూర్తి చేసి వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గపు ఆలోచనలతో ప్రైవేట్ వ్యక్తలకు కాలేజీలను కట్టబెట్టాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ప్రజలకు జరుగుతున్న అన్నాయాన్ని సంతకాల రూపంలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి వైఎస్సార్ సీపీ ఆద్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం ఏడాదిన్నలోనే ప్రజల విశ్వాసం కోల్పోయిందని పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వం కళ్లు తెరిపించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. సిద్ధవరంలో సర్పంచ్ రావినూతల మరియమ్మ ఇమ్మానియేలు, ఎంపీటీసీ మీరావళి, మాజీ ఎంపీటీసీ బాలఅంకయ్య, సర్పంచ్ యలమందల శ్రీనివాసులు, గ్రామ పార్టీ నాయకులు టి.నాగిరెడ్డి, కె.బాలవెంకటరెడ్డి, కాట్రగుంటలో నాయకులు గంగిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కందెర పెద్దన్న, కుమ్మరి రమణయ్య ఏదుబాటి వెంకటరావు, సానికొమ్ము రవీంద్ర, అలవల నాగిరెడ్డి, మోరా చెన్నారెడ్డి, మోరా వెంకటరెడ్డి, కుర్రా యోగయ్య, రాజాల వెంకటేశ్వరరెడ్డి, చల్లా వెంకటేశ్వర్లు, టి.సుబ్బారావు, పెండెం కొండయ్య, కొండలరావు తదితరుల ఆధ్వర్యంలో అన్నాతో పాటు మండల నాయకులకు ఘన స్వాగతం పలికారు. కోటి సంతకాల సేకరణలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వైస్ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, ఎంపీపీ మోరబోయిన మురళీకృష్ణయాదవ్, జడ్పీటీసీ అక్కిదాసరి ఏడుకొండలు, వైస్ ఎంపీపీ గొంగటి జెనీఫా, మండల పార్టీ అధ్యక్షులు మోరా శంకర్‌రెడ్డి, విద్యార్థి విభాగం నియోజకవర్గ కన్వీనర్ ఏలూరి సంజీవరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ ఉడుముల కాశిరెడ్డి, పార్టీ అనుబంధ విభాగల సభ్యులు గాడి కోనేటిరెడ్డి, గొంగటి కరుణయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దారుణం
చంద్రబాబు సర్కారు కుట్రలను ప్రజలంతా తిప్పి కొట్టాలి
వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ధ్వజం


