
విజేతల స్ఫూర్తితో ముందుకు సాగాలి
విజయనగరం గంటస్తంభం: సమాజంలో నేటితరం విద్యార్థులకు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ లక్ష్యసాధనకు కసిగా కృషి చేయాలని విజయనగరం జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి మజ్జి కృష్ణారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం జామి మండలంలోని అట్టాడ గ్రామంలో గల బీఎస్‌ఆర్ ఆశ్రమంలో జిల్లా పౌరవేదిక, ఎన్‌వీఎన్ బడ్ల్ బ్యాంక్ సంయుక్తంగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో సత్తా చాటిన విద్యార్థులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..విద్యార్థులు నిరంతరం జాతీయ, అంతర్జాతీయ విజేతల జీవిత ఘట్టాలు చదవాలని వారినుంచి స్ఫూర్తి పొందాలని గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు సాధించిన విజయాలను చూసి చదువు పట్ల ఆసక్తి ఉన్నవారికి ఉత్సాహం కలుగుతుందన్నారు. విశ్రాంత చీఫ్ బ్యాంకింగ్ అధికారి పిడకల ప్రభాకరరావు మాట్లాడుతూ..ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభను చూపిన విద్యార్థులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందన్నారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ చాలముఖ్యమని పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చాలా ఆరాటపడుతుంటారనే విషయాన్ని విద్యార్దులు మరిచిపోకూడదని హితవు పలికారు. పాఠశాలల వారీగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అతిథులు ఘనంగా సన్మానించారు. సమావేశంలో పౌరవేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ, ఎన్‌వీఎస్ బ్లడ్ బ్యాంక్ అధినేత తాడేపల్లి నాగేశ్వరరావు, తుమ్మగంటి రాంమోహన్‌రావు, ఇప్పలవలస గోపాలరావు, ఆశ్రమం నిర్వాహకులు భీశెట్టి శారద, ఆడారి హరిత సాయి తదితరులు పాల్గొన్నారు.
సైనిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి
మజ్జి కృష్ణారావు
టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన ఆశ్రమ
విద్యార్ధులకు అభినందన