
సూర్యప్రకాష్‌కు విజనరీ ఇండియన్స్ అవార్డు
గరుగుబిల్లి: విభిన్న రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారిని కేంద్ర ప్రసార భారతి మంత్రిత్వశాఖ గుర్తించి విజనరీ ఇండియన్స్ అవార్డులను అందజేసింది. ఇందులో భాగంగా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన డా.గుల్ల సూర్యప్రకాష్ హైదరాబాద్‌లోని కేర్ హస్పిటల్‌లో కార్డియాలజిస్టుగా విధులను నిర్వహిస్తున్న ఆయన విజనరీ ఇండియన్స్ అవార్డుకు ఎంపిక కాగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి పూనమ్ ధిల్లాన్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఆయన కేర్ ఆస్పత్రిలో సేవలను అందిస్తూనే ఈ ప్రాంతీయులకు సేవలను అందించాలనే ఉద్దేశంతో మండలంలోని రావుపల్లి, కొత్తూరు తదితర గ్రామాలలో ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించి వందలాదిమందికి సేవలను అందిస్తున్నారు. చిరకాలంగా వైద్యసేవలను అందిస్తూ ఈ ప్రాంతీయుల మన్ననలను పొందుతున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో అటు తెలంగాణ రాష్ట్రంలో సేవలను అందిస్తున్నారు. ఆయన సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి కేంద్రప్రసారభారతి మంత్రిత్వశాఖ ఈనెల 18న న్యూ ఢిల్లీలోని ఆకాశవాణి భవనంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో డా.సూర్యప్రకాష్‌కు విజనరీ ఇండియన్స్ అవార్డును బహుకరించింది. ఆయన ప్రత్యేక అవార్డును అందుకోవడంపట్ల గ్రామసర్పంచ్ బొంతాడ మహేశ్వరరావు, మాజీ సర్పంచ్ గుల్ల కాశినాయుడు, అన్నపూర్ణమ్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.