
ఎంఆర్‌పీ ఉల్లంఘన జరగలేదు
నెల్లిమర్ల రూరల్: మద్యం అమ్మకాల్లో ఎలాంటి ఎంఆర్‌పీ ఉల్లంఘన జరగలేదని ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు స్పష్టం చేశారు. నెల్లిమర్ల మండలంలోని సతివాడ మద్యం దుకాణంలో ఎంఆర్‌పీకి అదనంగా మద్యం అమ్ముతున్నారని పలువురు మద్యం ప్రియులు ఇచ్చిన ఫిర్యాదుపై బుధవారం ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత మంది వ్యక్తుల ఫిర్యాదుతో సతివాడలో మద్యం దుకాణాన్ని పరిశీలించి విక్రయాలపై ఆరా తీశామన్నారు. కొత్త ధరలపై పాత స్టిక్కర్లు ఉండడమే ఈ విధమైన ఆరోపణలకు ప్రధాన కారణంగా గుర్తించామని చెప్పారు. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మద్యం డిపోను కూడా సందర్శించి ధరలను సరిచూశామని తెలిపారు. సిగ్నేచర్ విస్కీ క్వార్టర్ బాటిల్ పాత ధర రూ.330గా ఉండేదని, ప్రస్తుతం పెంచిన ధరతో రూ.350గా అమ్మకాలు సాగుతున్నాయన్నారు. పాత స్టిక్కర్ రూ.330 బాటిల్‌పై ఉండడంతో మద్యం తాగేందుకు వచ్చిన వారు ఫిర్యాదు చేశారని, ప్రస్తుత ధరతోనే షాపులో అమ్మకాలు జరిగాయని స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా ఏ మద్యం షాపులోనూ పైసా కూడా అదనంగా తీసుకోవడం లేదని చెప్పారు. నిత్యం షాపులపై తనిఖీలు జరుపుతున్నామని, ఎంఆర్‌పీని ఉల్లంఘిస్తే షాపులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఎకై ్సజ్ సీఐ వెంకట్రావు