
ఆవేదనలో రైతన్న
అధ్వానంగా సాగునీటి వనరులు..
● పూడుకుపోయిన పంట కాలువలు
● శివారు భూములకు సాగునీరు
ప్రశ్నార్థకం
● పట్టించుకోని కూటమి నేతలు
ఆదేశాలు వచ్చాయి
ఉపాధిహామీ పథకం కింద చేపట్టే చెక్‌డ్యాంలు, క్యాస్కేడింగ్స్, చెరువుల పనులు ఆరువారాల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలో 39 చెక్‌డ్యాంలు, 122 చెరువులు, 40 క్యాస్కేడింగ్స్ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకున్నాం. ఉపాధిహీమీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయిచిన రూ. 210కోట్ల నిధుల్లో జలవనరుల పనులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం.
– కె.రామచంద్రరావు, జిల్లా నీటి
యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు,
పార్వతీపురం మన్యం
పార్వతీపురం రూరల్: ఖరీఫ్ సాగు సమయం ఆసన్నమవుతోంది. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు రైతులు పొలాలను దుక్కిచేసి సాగుకు సిద్ధం చేస్తున్నారు. అయితే, పంటకు సాగునీరందించే కాలువలు, చెరువులు అధ్వానంగా ఉండడం రైతన్నలను ఆవేదనకు గురిచేస్తోంది. పూడుకలు, పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్న కాలువలను చూసి రైతులు కలతచెందుతున్నారు. సాగునీరు అందుతుందో లేదోనని బెంగపడుతున్నారు. ఇప్పటికే రైతు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడంలేదు. సాగునీటి వనరుల అభివృద్ధికి కనీస చర్యలు తీసుకోవడంలేదంటూ రైతన్నలు వాపోతున్నారు. తక్షణమే స్పందించి కనీసం ప్రధాన, పిల్లకాలవలను బాగుచేయాలని కోరుతున్నారు.
ఇప్పటికే పనులు పూర్తి చేయాలి
జిల్లాలో తోటపల్లి, జంఝావతి, వట్టిగెడ్డ, వెంగళరాయ, రావాడ గెడ్డ, సాకిగెడ్డల పరిధిలోని కాలువలు, చెక్‌డ్యామ్‌లు, షట్టర్లను బాగుచేయాల్సి ఉంది. కాలువలు పూడుకలతో నిండినా పట్టించుకోకపోవడం విచారకరం. మరికొద్ది రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆరంభమై వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ సమయంలో పనులు ఎలా చేపడతారో పాలకులు, అధికారులకే తెలియాలి. – వంగల దాలినాయుడు, చెరువుల పరిరక్షణ సమితి సభ్యుడు, పార్వతీపురం మన్యం

ఆవేదనలో రైతన్న

ఆవేదనలో రైతన్న

ఆవేదనలో రైతన్న