
వారానికి రూ.వంద కొట్టు..
సోమవారం శ్రీ 12 శ్రీ మే శ్రీ 2025
● ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో అవినీతి మేత ● వేతనదారుల నుంచి అక్రమ వసూళ్లు ● డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నట్టు?
జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు
108లో ప్రసవం
సీతంపేట: మండలంలోని లాడ జలుబుగూడ గ్రామానికి చెందిన సవర గయ్యారమ్మ 108లో శనివారం రాత్రి ప్రసవించింది. పురిటినొప్పు లు రావడంతో కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. ఈఎంటీ రాములు, పైలెట్ అనంతరా వు గ్రామానికి చేరుకుని స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకువస్తుండగా మార్గమద్యలో పురిటినొప్పులు ఎక్కువ కావడంతో ప్రసవం చేశారు. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. వారికి ఫ్లూయిడ్స్ ఎక్కించి తదుపరి వైద్య సాయం కోసం సీతంపేట ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. 108 సిబ్బందిని గ్రామస్తులు అభినందించారు.
పెండింగ్ నీటి ప్రాజెక్టులు
పూర్తి చేయాలి
పార్వతీపురం టౌన్: జిల్లాలో పెండింగ్ నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి డిమాండ్ చేశా రు. స్థానిక ఎన్జీవో హోంలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెండింగ్ నీటి ప్రాజెక్టులపై ఆదివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నీటి ప్రాజెక్టులపై రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తి చూపారు. ఈ ఏడాది బడ్జెట్లో కూడా జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న జంఝావతి, అడారుగెడ్డ, కారిగెడ్డ, వనకబడి, పెద్దగెడ్డ ప్రాజెక్టులకు నిధులు నిల్‌గానే ఉన్నాయని దుయ్యబట్టారు. తోటపల్లి ప్రాజెక్టు పూర్తికి అధికారులు రూ.590 కోట్లు ప్రతిపాదించగా ఉద్యోగుల భత్యం కోసం రూ.47 కోట్లు విడుదల చేసిందని ఇది చాలా అన్యాయమని దుయ్యబ ట్టారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయాన్ని పోరాడి తిప్పికొట్టాలని అందుకు తోటపల్లి, పెద్దగెడ్డ నిర్వాసితుల, రైతుల పోరాటాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అందులో భాగమే ముందుగా రైతులు సంతకాలు చేసి గ్రామ సచివాలయాల వద్ద మే 21 నుంచి 24 వరకు నిరసనలు తెలియజేసి వినతులు అందిస్తామని, అనంతరం ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సదస్సులో రైతులు, వ్యవసాయ కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్మీనాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు బంటు దాసు, కరణం రవీంద్ర, రైతులు పాల్గొన్నారు.
నేడు ఉత్త్తరాంధ్ర సాధన సమితి సదస్సు
బొబ్బిలి: పట్టణంలోని ఎన్‌జీవో హోంలో సోమవారం ఉదయం 10 గంటలకు ఉత్తరాంధ్ర సాధన సమితి ఆధ్వర్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులతో సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆ సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు తెలిపారు. ఆదివారం సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సాక్షి, పార్వతీపురం మన్యం :
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. వేతనదారులకే కాదు, ఆ శాఖలోని అధికారులకు, సిబ్బందికీ ఉపాధి చూపుతోంది. గ్రామీణ ప్రాంత పేదలకు పని కల్పించి, వలసలను నివారించాలన్న ఉద్దేశంతో ఈ పథకం అమలు చేస్తే.. చట్టంలో లొసుగులు అధికారుల జేబులు నింపుతున్నాయి. జిల్లాలో 1.92 లక్షల మేర జాబ్‌కార్డులుంటే.. 1.68 లక్షల మంది వరకు ఉపాధిహామీ పనుల్లో పాల్గొంటున్నారు. 46 వేల కుటుంబాలకు పైగా ఈ ఏడాది వంద రోజుల పనిదినాలు పూర్తి చేశాయి. ఉపాధి హామీ ద్వారా భూమి అభివృద్ధి, నీటి కుండీలు, ఫాం పాండ్లు, చెరువులు, పంట కాలువలు, కందకాలు తదితర పనులు చేపడుతున్నారు. వేతనదారులకు సగటున రోజువారీ వేతనం జిల్లాలో రూ.260 వరకు వస్తోంది. పథకం అమలు, జరుగుతున్న పనులు, వేతనదారులకు ఉపాధి చూపించడంలో జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అవార్డును కూడా అందజేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. అవినీతిలోనూ జిల్లా యంత్రాంగానికి అవార్డు ఇవ్వాల్సిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేతనదారులకే కాదు.. ఆ శాఖలోని సిబ్బంది, అధికారులకూ రూ.లక్షల్లో ఆదాయాన్ని పథకం చేకూరుస్తోంది.
టార్గెట్.. నెలకు రూ.4 కోట్లు!
సాధారణంగా ఉపాధి పనుల కల్పనలో లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. ఉపాధి పథకం సిబ్బంది వసూళ్లలోనూ టార్గెట్ పెట్టుకున్నారు. ఒక్కో వేతనదారు నుంచి వారానికి రూ.వంద చొప్పున ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. వేతన చెల్లింపుల బకాయిలతో సంబంధం లేకుండా పనికి వచ్చిన వారు ఎవరైనా సరే.. వారానికి రూ.వంద చొప్పున చెల్లించాల్సిందేనని వేతనదారులే చెబుతున్నారు. వీరి నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు వసూలు చేస్తే.. ఆ మొత్తం అలా టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, ఏపీవో, పీడీ వరకూ చేరుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి గత జనవరి నుంచి వేతనదారులకు సక్రమంగా చెల్లింపులు చేయడం లేదు. రూ.కోట్లలో బకాయిలు ఉండిపోయాయి. చెల్లింపులతో సంబంధం లేకుండా.. వేతనదారుల నుంచి అక్రమంగా వారానికి రూ.100 చొప్పున మాత్రం వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఒక జట్టులో 20 నుంచి 40 మంది వరకు వేతనదారులు ఉంటున్నారు. ఒక పంచాయతీలో వారానికి 800 మందికి పని కల్పిస్తే.. వారి నుంచి వసూలైన మొత్తమే రూ.80 వేలు. మండలానికి 30 పంచాయతీలుంటే.. కేవలం నాలుగైదు పంచాయతీల్లోనే వసూళ్లు కాస్త అటూఇటుగా ఉంటున్నాయని తెలుస్తోంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సగటున వారానికి లక్ష మందికి ఉపాధి పనులు చూపుతున్నారని అనుకున్నా.. ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన ఆ మొత్తం రూ.కోటి వరకు అవుతోంది. ఈ విధంగా జిల్లాలో దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకూ వేతనదారుల నుంచి అక్రమంగా వసూలవుతోంది.
ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయ్..
ఇదే విషయమై వేతనదారులను ప్రశ్నిస్తే.. ‘ఆ పేర్లన్నీ ఎందుకులే బాబూ.. మీరొచ్చారని తెలిస్తేనే మమ్మల్ని వేధిస్తారు. ఇంక మా పేర్లు, ఫొటోలు పేపర్లో వేస్తే మరుసటి రోజు నుంచి మాకు పనులివ్వరు. ఉన్న పనిని పోగొట్టుకోవాలి. వారడిగిన రూ.వంద ఇచ్చుకుంటూ వెళ్లిపోతున్నాం.’ అని పేరు చెప్పేందుకు భయపడిన ఓ వేతనదారు వాపోయారు. జిల్లాలోని కొంత మంది ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద ఆరా తీస్తే.. ‘తిలాపాపం.. తలా పిడికెడు అన్న చందాన కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకూ ఆ మొత్తం వెళ్తుందంటూ..’ బదులిచ్చారు. సోషల్ ఆడిట్‌లో ఏమైనా జరిగితే ఆ ఖర్చులన్నీ ఫీల్డ్ అసిస్టెంట్‌నే భరించుకోవాల్సి వస్తోందని, లబ్ధి పొందిన అధికారులెవరూ ఇవ్వరని వాపోయారు.
పనుల కల్పనే.. వారికి ‘ఉపాధి’
60 శాతం వరకు వేతనదారులకు పనులు చూపిస్తేనే.. 40 శాతం మెటీరియల్ కాంపొనెంట్ నిధులు విడుదలవుతాయి. ఆ మొత్తం ఒక్క జిల్లాలోనే రూ.కోట్లలో ఉంటుంది. ఆ నిధుల కోసం అధిక శాతం మందికి పనులు చూపిస్తున్నట్టు అధికారులు లెక్కలు రాసేసుకుంటున్నారు. గ్రామాల్లో లేని వారి పేర్లు సైతం రాసేసి, ఆ సొమ్మునూ స్వాహా చేస్తున్నారు. దొంగ మస్తర్లు కూడా ఉంటున్నాయి. మరోవైపు వేతనదారులకు ఎండ నుంచి రక్షణ కోసం పని చేసే చోట టెంట్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లు ఉంచాలి. ఆ సౌకర్యాలేవీ ఉండటం లేదు. ఎండలోనే వేతనదారులు పనులు చేసుకుంటున్నారు. కాస్త నీరసంగా అనిపిస్తే సమీపంలోని చెట్ల వద్దకు నీడ కోసం పరుగులు తీస్తున్నారు. చెరువుల్లో నీరే తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో వేసవిలో పని చేసే చోట టెంట్లు సరఫరా చేసేది. కూలీలకు మజ్జిగ అందుబాటులో ఉంచేది. దీంతో పాటు వేతనదారులు సామగ్రి తెచ్చుకుంటే.. తట్టకు రూ.5, గునపాంనకు రూ.5, పారకు రూ.3, మజ్జిగకు రూ.5 చొప్పున ప్రతి రోజూ లెక్కకట్టి ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ సౌకర్యాలేవీ లేవు. ప్రభుత్వం నుంచి ఆ డబ్బులొస్తున్నాయో, లేదో.. ఆ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అధికారులకే తెలియాలి.
ప్రభుత్వ నిర్ణయం సరికాదు
● ఎస్‌జీటీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
చంద్రరావు
గజపతినగరం : రాష్ట్రంలో మోడల్ ప్రైమరీ స్కూళ్ల ప్రధానోపాధ్యాయులుగా స్కూల్ అసిస్టెంట్ల నియామకం సరికాదని, ఈ పద్ధతిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కనకల చంద్రరావు అన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరులతో ఆదివారం మాట్లాడారు. జీవో నంబరు 117 ద్వారా అనేక మంది ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పదోన్నతులు కల్పించిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రమోషన్లు పొందిన వారిని వెనక్కి తీసుకువచ్చి మోడల్ ప్రైమరీ స్కూళ్ల హెడ్ మాస్టర్లుగా నియమించడం సరైన పద్ధతి కాదని విమర్శించారు. ఇప్పటికే కనీసం ప్రమోషన్లు రాక ఎస్‌జీటీలు ఎంతో వేదన చెందుతున్నారని, ఈ వేదనను ప్రభుత్వం మరింత పెద్దది చేసిందన్నారు.
అసలు డీఎస్సీలో బీఎడ్ అనేది ప్రైమరీ ఉపాధ్యాయుడికి అర్హత కాదన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ ప్రైమరీ పాఠశాలలో పని చేయడానికి అర్హత ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం తన పద్ధతిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
పార్వతీపురం రూరల్ : జిల్లా వ్యాప్తంగా ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా బాంబు డిస్పోజబుల్ టీం, డాగ్ స్వ్కాడ్‌తో కలిసి సంయుక్తంగా పోలీసులు తనిఖీలు చేసినట్టు ఎస్పీ మాధవ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం పోలీసు అధికారులు వారి స్టేషన్ల పరిధిలోని ముఖ్య కూడళ్లు, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్, లాడ్జీలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు. దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్టు ఎస్పీ స్పష్టం చేశారు.
న్యూస్‌రీల్

వారానికి రూ.వంద కొట్టు..

వారానికి రూ.వంద కొట్టు..

వారానికి రూ.వంద కొట్టు..

వారానికి రూ.వంద కొట్టు..

వారానికి రూ.వంద కొట్టు..

వారానికి రూ.వంద కొట్టు..

వారానికి రూ.వంద కొట్టు..