
నీలి కిరణాలతో అంధత్వం
నేత్ర తనిఖీలు
నిర్వహిస్తున్న
దృశ్యం
చికిత్స, నివారణ..
కళ్లకు తేమను కలిగించేలా కృత్రిమంగా కన్నీళ్లు తరచుగా వాడడం
● కళ్ల రెప్పలను తరచుగా మూయడం
● దృష్టిలోపాలకు వాడే అద్దాలు బ్లూఫిల్టర్ ఉండేలా చూడడం
● స్క్రీన్ టైం తగ్గించుకోవడం
● 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులను 20 సెకెన్లపాటు వీక్షించడం.
● కంప్యూటర్, సెల్‌ఫోన్ స్క్రీన్ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్‌ను సర్దుబాటు చేసుకోవడం
● కంప్యూటర్, సెల్‌ఫోన్‌లో అక్షరాలను పెద్దవిగా చేసుకోవడం.
● సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు డ్రై ఐ గురించి కంటి వైద్యులను సంప్రదించడం
● సెల్‌ఫోన్, కంప్యూటర్ అతిగా వాడకంతో ఇబ్బందులు
● చిన్న వయసులోనే దృష్టిలోపాలు
● పెరుగుతున్న దూరదృష్టి సమస్యలు
● కంటివైద్యుల వద్దకు క్యూకడుతున్న
బాధితులు
కంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు..
● ప్రతి అరగంటకు ఒకసారి మొబైల్, కంప్యూటర్, లాప్‌టాప్ నుంచి రెండు మూడు నిమిషాలైనా దృష్టిని మరల్చాలి.
● కంటికి స్క్రీన్‌ను 25 నుంచి 40 అంగుళాల దూరం ఉంచాలి.
● యాంటీగ్లేర్, యాంటీ రిఫ్లెక్టివ్ అద్దాలను వాడితే కంటికి రక్షణగా ఉంటుంది. ఇవి అధిక కాంతిని కళ్లపై పడకుండా అడ్డుకుంటాయి.
● కళ్ల మంటలు, నీరు కారడం వంటి సమస్యలుంటే కాసేపు మానిటర్లు చూడడం ఆపేయాలి.
● తరచూ చల్లని నీటితో కళ్లను కడుక్కోవాలి. రాత్రి నిద్రించే సమయంలో కళ్లపై కాసేపు తడి వస్త్రాన్ని కప్పి ఉంచాలి.
● కంటికి కసరత్తులు సైతం అవసరం. ఇందుకోసం కళ్లను కుడిఎడమలకు నిమిషంపాటు తిప్పాలి. రెండు అరచేతులు రుద్దకుని వేడెక్కిన తరువాత కళ్లపై కాసేపు ఉంచి కసరత్తు చేయాలి.