
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ ఆనంద్
పార్వతీపురం:
మ్యుటేషన్ల జారీలో జాప్యంచేయొద్దని, భూముల రీ సర్వే పక్కాగా నిర్వహించాలని జేసీ ఒ.ఆనంద్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. రీ సర్వేకు సంబంధించి ప్రతి మండలానికి, గ్రామానికి ప్రత్యేకంగా నియమించిన సర్వేయర్లు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం తయారుచేసిన సర్వే రికార్డులే రానున్న తరాలకు ప్రామాణికమని స్పష్టంచేశారు. పక్కాగా సర్వే నిర్వహించి సాగుదారులకు తప్పులులేని భూ హక్కు పత్రాలు అందించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో భూమిపై సాగులో ఉన్నవారి వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు. మ్యుటేషన్, భూ పంపకాలు మొద లైనవి పూర్తిచేస్తే పని సులభతరమవుతుందన్నారు. మ్యుటేషన్ విషయంలో వీఆర్వోలు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓ కె.హేమలత, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, మండల, విలేజ్ సర్వేయర్లు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సంయుక్త కలెక్టర్ ఆనంద్