
బెలగాంలో ఆర్‌ఎమ్‌డీ స్టాల్‌ను పరిశీలిస్తున్న ఐటీడీఎ పీఓ విష్ణుచరణ్
● ఐటీడీఏ పీఓ విష్ణుచరణ్
పార్వతీపురంటౌన్: గిరిజన ఉత్పత్తుల మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించినట్టు ఐటీడీఎ పీఓ విష్ణుచరణ్ తెలిపారు. పార్వతీపురం పట్టణంలోని ఆర్‌ఎమ్‌డీ స్టాల్స్‌ను ఆయన శనివారం పరిశీలించారు. స్టాల్స్‌ను పెంచాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు చెక్‌పెట్టి జనం చెంతకు గిరిజన ఉత్పత్తులు చేర్చుతున్నామన్నారు. ఇందులో భాగంగానే ఆర్‌ఎండీ, కాఫీ స్టాల్స్‌ల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకున్నామని వివరించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్‌లలో స్టాల్స్ ఏర్పాటుకు సంబంధిత అధికారులతో మాట్లా డామని చెప్పారు. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు గిరిజన ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్నామన్నారు. దళారుల చేతుల్లో గిరిజనులు మోసపోకుండా వారివద్ద ఉన్న ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని కొన్ని షాపులు, అవుట్‌లెట్‌లు, మొబైల్ వ్యాన్ల ద్వారా గిరిజన ఉత్పత్తులను ప్రజల చెంతకు చేరవేసి ఆర్థికంగా ఆదుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో జీసీఎంఎస్ డివిజనల్ మేనేజర్ మహేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
నలుగురు డీబార్
విజయనగరం పూల్‌బాగ్: ఇంటర్మీడియట్ ఫిజిక్స్ పేపర్–1, ఎకనామిక్స్ పేపర్–1 పరీక్షకు విజయనగరం ఉమ్మడి జిల్లాలో శనివారం 26,058 మంది విద్యార్థులు హాజరుకాగా, 1936 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ 4 పరీక్ష కేంద్రాలను, డీఈసీ మూడు కేంద్రాలను తనిఖీ చేశారు. స్క్వాడ్ బృందాలు 42, ఇతర అధికారులు 8 కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన నలుగురు విద్యార్థులను డీబార్ చేసినట్టు ఆర్‌ఐఓ ఎం. సత్యనారాయణ తెలిపారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.