
పీహెచ్‌సీలో రికార్డులు పరిశీలిస్తున్న డీఎంహెచ్‌ఓ రమణకుమారి
● డీఎంహెచ్‌ఓ రమణకుమారి
వంగర: పీహెచ్‌సీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌ఓ ఎస్.వి.రమణకుమారి అన్నారు. స్థానిక పీహెచ్‌సీని శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ విభాగం, రికార్డులు నిర్వహణ, ఉద్యోగుల హాజరు, ఆపరేషన్ థియేటర్, పేషెంట్స్ గదులను పరిశీలించారు. అనంతరం మందులు భద్రపరిచే గదిని తనిఖీ చేశారు. మందుల నిల్వలపై అప్రమత్తంగా ఉండాని సూచనలు చేశారు. అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించి ప్రజలకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే ఫ్రైడే – డ్రైడే కార్యక్రమం నిర్వహణపై సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లలో పూర్తి స్థాయి సిబ్బంది నియామకం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యాధికారిణి సౌమ్య, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.