
జాతీయ తైక్వాండో పోటీలకు ఎంపికై న జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 31 వరకు సబ్ జూనియర్స్, కాడెట్ విభాగాల్లో రాజస్థాన్‌లో జరగనున్న జాతీయ పోటీలకు అర్హత సాధించారు. జాతీయ తైక్వాండో పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుల్లో ఎన్.షణ్ముఖ సిద్దార్థ నాయుడు, బొంగు యశస్విని, జి.జాహ్నవి, జి.చరిత, సీహెచ్ హర్షవర్ధన్, కె.మొక్షిత్ ఉన్నారు. జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారులను జిల్లా తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యాలు, కార్యదర్శి సి.హెచ్.వేణుగోపాలరావు, కోచ్‌లు టి.రాజు, కె.కోటేశ్వరరావు అభినందించారు.