అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలి

సమావేశంలో మాట్లాడుతున్న జేసీ ఆనంద్‌ - Sakshi

పార్వతీపురం టౌన్‌: అన్ని రంగాల్లో మహిళలు ముందుండాలని జాయింట్‌ కలెక్టర్‌ ఓ.ఆనంద్‌ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ పక్షోత్సవాలను పురస్కరించుకుని గత పదిహేను రోజులుగా జరుగుతున్న వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు విద్య, వైద్య, శిశు సంక్షేమ శాఖల నుండి ప్రతిభ కనబరుస్తూ జాతీయ, అంతర్జాతీయంగా రాణిస్తున్నారన్నారు. కొత్తగా ఏర్పడిన మన జిల్లాలో విద్యా, వైద్య, శిశు సంక్షేమ రంగాల్లో మహిళలు ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లాకు మంచి పేరు తీసుకురావడంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉండాలంటే మహిళలు ముఖ్య పాత్ర వహించాలని జేసీ సూచించారు. సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరంగా మహిళలు, పురుషులు సమానమేనని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా శాంతియుతంగా, ప్రశాంతంగా జీవించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జరుపుకోవాలని సూచించిదన్నారు. ఈ సందర్భంగా క్రీడల్లో పాల్గొన్న, వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన మహిళలకు పురస్కారాలను అందజేశారు. రెవెన్యూ డివిజనల్‌ అధికారి కె.హేమలత, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారి విజయగౌరీ, డీఈఓ ఎస్‌డీవీ రమణ, డీఎంహెచ్‌ఓ బగాది జగన్నాధరావు, క్రీడా సాధికారత అధికారి కె.రామ్‌గోపాల్‌, క్రీడా శాఖ జిల్లా అధికారి ఎస్‌.వెంకటేశ్వరావు, ముఖ్య ప్రణాళికా అధికారి వీర్రాజు, క్రీడా సాధికారత కో – ఆర్డినేటర్‌ గాంధీ మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

జేసీ ఆనంద్‌




 

Read also in:
Back to Top