
వేపాడ: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన జనపరెడ్డి ఈశ్వరరావు(38) ఆత్మహత్యకు పాల్పడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వల్లంపూడి ఎస్‌ఐ రాజేష్ తెలిపిన వివరాలు.. బొద్దాం గ్రామానికి చెందిన ఈశ్వరరావు శుక్రవారం రాత్రి 8 గంటలకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.
పొట్టేళ్ల పందాలపై
పోలీసుల దాడి
వీరఘట్టం: మండలంలోని కంబర గ్రామంలో జరుగుతున్న పొట్టేళ్ల పందాలపై శనివారం తెల్లవారుజామున దోనుబాయి ఎస్.ఐ కిషోర్‌వర్మ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో రెండు పొట్టేళ్లు, ఒక బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని తొమ్మిది మంది పందెంరాయుళ్లపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ కృష్ణంనాయుడు తెలిపారు. రూ. 6,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పా రు. పేకాట శిబిరాలు నిర్వహించడం, పొట్టేళ్ల పందేలు జరిపించడం, క్రికెట్ బెట్టింగ్‌లు తదితర అసాంఘిక కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే శాఖపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కిషోర్‌వర్మ పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి
దుర్మరణం
డెంకాడ: మండలంలోని కొత్త ముంగినాపల్లి జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన బొబ్బాది సూరమ్మ(61) మృతి చెందిందని ఎస్‌ఐ మహేష్ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కొత్త (ఎస్సీ)ముంగినాపల్లి గ్రామం నుంచి గుణుపూరుపేట వైపు వస్తున్న సూరమ్మను వెనుక వైపు నుంచి వచ్చిన మోటారు సైకిల్ ఢీకొట్టింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సూరమ్మ అక్కడికక్కడే మరణించిందని ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజాం సిటీ: మండల పరిధి సోపేరు గ్రామానికి చెందిన మామిడి సూర్యారావు (53) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడని ఎస్‌ఐ వై.రవికిరణ్ శనివారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు.. నిత్యం మద్యానికి బానిసైన సూర్యారావు ఎప్పటిలాగే ఈ నెల 18న మధ్యాహ్నం కొంత మద్యం సేవించి ఇంటికి వెళ్లాడు. మిగిలిన మద్యం సేవించేందుకు పశువుల శాలకు చేరుకున్నాడు. శాలలో దాచి ఉంచిన గడ్డి మందును మద్యం అనుకుని సేవించాడు. ఇది గమనించిన అతని భార్య సుజాత ఆటోలో రాజాం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు వైద్యులు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడని, భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

పందెంరాయుళ్లతో పాటు పొట్టేళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు

రోడ్డు ప్రమాదంలో మరణించిన సూరమ్మ

ఈశ్వరరావు మృతదేహం