
కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎఫ్‌టీసీ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ త్రినాథస్వామి
డెంకాడ: నీరు జీవనధారమని ఎఫ్‌టీసీ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్ (శ్రీకాకుళం) కె.త్రినాథస్వామి అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని చింతలవలస ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో కళాశాల సివిల్ ఇంజినీరింగ్ విభాగం, ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ‘మార్పును వేగవంతం చేయండి’ అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన త్రినాథస్వామి మాట్లాడుతూ, జీవరాశులతో పాటు పంటలకు నీరే ప్రధానమన్నారు. నీటిని సరైన పద్ధతిలో వృథా కాకుండా వినియోగించి భూగర్భ జలాలను పెంచాలని సూచించారు. మినుములు, తృణధాన్యాలను తక్కువ నీటితో పండించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో మినుములు తప్పనిసరిగా తీసుకుకోవాలన్నారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బి.ఉమాశంకర్ మాట్లాడుతూ, 2024 సంవత్సరం నాటికి అన్ని గ్రామాల్లోని ఇళ్లకు కుళాయి కనెక్షన్లు అందించేందుకు పనులు ముమ్మరంగా చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బి.రఘువీరా, వైస్ ప్రిన్సిపాల్ పి.రంగరాజు, ఎన్‌ఎస్‌ఎస్ పీఓ ఎన్.షణ్ముఖరావు, హెచ్‌ఓడీ పి.మార్కండేయరాజు, అధ్యాపకులు ఎస్.చంద్రమౌళి, సీహెచ్‌వీ రవిశంకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఎఫ్‌టీసీ అగ్రికల్చర్ డిప్యూటీ డైరెక్టర్
త్రినాథస్వామి