
కలెక్టర్ సూర్యకుమారికి వినతిపత్రం అందజేస్తున్న జర్నలిస్టులు
విజయనగరం అర్బన్: డిమాండ్ల సాధనలో భాగంగా గురువారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ఏపీయూడబ్ల్యూజే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరస న వ్యక్తం చేశారు. ఐజేయూ పిలుపు మేరకు ‘సేవ్ జ ర్నలిజం డే’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ సూర్యకుమారికి వినతిపత్రం అందజేశారు. ఏపీయూడబ్ల్యూజే నాయకుడు పీఎస్‌వీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యూనియన్ నాయకులు జీవీ ప్రసాద్, వి. మ హాపాత్రో, పంచాది అప్పారావు, వైఎస్ పంతులు, నాగరాజు, ఎంఎస్‌ఎన్ రాజు, భరత్, డేవిడ్‌రాజు, ప్రతాప్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.