
సిరిసహస్ర, ప్రదీప్‌ల వివాహ వేడుక
విజయనగరం: జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పుష్పాంజలి దంపతుల కుమార్తె సిరిసహస్ర, నెల్లిమర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, పద్మావతి దంపతుల కుమారుడు ప్రదీప్ వివాహ వేడుక గురువారం వైభవంగా జరిగింది. డెంకాడ మండలం దాకమర్రిలో గల రఘు ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ నూతన వధూవరులు ఒక్కటయ్యారు. వివాహ వేడుకకు హజరైన ఎంపీ వి.విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి, జేసీ మయూర్ అశోక్, పార్వతీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్‌షా, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, నగర డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఈశ్వర్ కౌశిక్‌లతో పాటు ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి