పార్వతీపురం: గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన ఎం.నాగమణి మనస్తాపానికి గురై చీమలమందు తాగి ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ సంఘటనపై పార్వతీపురం ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తన భర్త రాంబాబుతో మనస్పర్థల కారణంగా నాగమణి కొన్నేళ్లుగా అమ్మగారి ఇంటివద్ద ఉంటోంది. ఇటీవల వారి కుమార్తె పుష్పవతి అయ్యింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్‌లో చెప్పగా ఫంక్షన్ చేయకు, నేను రానుంటూ కసురుకున్నాడు. ఈ విషయమై మనస్తాపం చెందిన ఆమె ఇంట్లో ఉన్న చీమలమందు తాగేసింది.గమనించిన స్థానికులు ఇంటిలో ప్రాథమిక చికిత్స అందించి 108 వాహనంద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు.