బీపీఎస్ సద్వినియోగం చేసుకోండి
నరసరావుపేట: అనధికారిక కట్టడాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (బిల్డింగ్ పీనలైజేషన్ స్కీము) అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు ఉపసంచాలకులు పి.మధుకుమార్ కోరారు. శుక్రవారం జిల్లాలోని మున్సిపాల్టీల్లో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ స్టాఫ్, డబ్ల్యుపీఆర్‌ఎస్, లైసెన్స్ టెక్నికల్ పర్సన్(ఎల్‌టీపీ)లకు ఎస్‌ఎన్‌ఆర్ కన్వెన్షన్ హాలులో బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్‌లపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టు 31లోపు నిర్మించిన భవనాలకు మాత్రమే అపరాధ రుసుం చెల్లించి రెగ్యులరైజ్ చేసుకోవచ్చన్నారు. జీఓ జారీచేసిన 120 రోజుల లోపు అర్జీ దాఖలు చేయాలన్నారు. వార్డుల వారీగా బీపీఎస్ పరిధిలోకి వచ్చే అక్రమ కట్టడాలను గుర్తించి వాటి యజమానులను అప్రమత్తం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ ఎం.జస్వంతరావు పాల్గొని మాట్లాడుతూ నిర్ణీత సమయంలోపు యజమానులు అర్జీలు దాఖలు చేసి అపరాధ రుసుం చెల్లించేలా ప్లానింగ్ అధికారులు, సిబ్బంది కృషిచేయాలని కోరారు. అలాగే ఎల్‌టీపీలు తమ సహాయ సహకారాలు అందజేయాలని సూచించారు.
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు
ఉపసంచాలకులు పి.మధుకుమార్


