సతీష్‌కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షుడు తుర్లగుంట
నాదెండ్ల: టీటీడీ పరకామణి విజిలెన్స్ అధికారిగా పనిచేసిన సతీష్‌కుమార్ అనుమానాస్పద మృతిపై ప్రభుత్వం సీబీఐతో విచారణ జరిపించాలని నాదెండ్ల పీఏసీఎస్ మాజీ సీఈవో, పల్నాడు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షుడు తుర్లగుంట చిన్నఅంజయ్య డిమాండ్ చేశారు. విధుల్లో నిజాయితీగా సేవలందిస్తూ, పరకామణిలో అవకతవకలు వెలుగులోకి తెచ్చిన సతీష్‌కుమార్ సేవ లు ఎనలేనివన్నారు. ఆయన మరణంపై ప్రభు త్వం పూర్తిస్థాయి విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని, సతీష్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.
పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా మధుబాబు
మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా అర్బనన్ డెవలప్‌మెంట్ అథారిటీ(పీఏయూడీఏ)చైర్మనన్‌గా్ నియోజకవర్గ టీడీపీ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు నియమితులయ్యారు. 2012లో జరిగిన మాచర్ల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన మధుబాబు ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తున్నారు. మధుబాబు నియామకంపై నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీకి చేసిన సేవలకు గానూ పదవి వరించిందని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తూ, మధుబాబుకు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర బట్రాజ కార్పొరేషన్ చైర్మన్‌గా సరికొండ
సత్తెనపల్లి: ఏపీ బట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన 12వ వార్డు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సరికొండ వెంకటేశ్వరరాజు అలియాస్ మార్కెట్ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శనివారం 11 కార్పొరేషన్లకు చైర్మన్‌లను నియమిస్తూ ప్రకటించింది. సరికొండ వెంకటేశ్వరరాజుకు బట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా అవకాశం కల్పించింది. వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్వరరాజుకు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభి నందనలు తెలిపారు.
సతీష్‌కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి
సతీష్‌కుమార్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలి


