పేద గిరిజనులకు 170 ఎకరాలు పంచాలి
నరసరావుపేట: బొల్లాపల్లి మండలం గండిగనుముల రెవెన్యూలోని సర్వే నంబర్ 430లో 170 ఎకరాలు పేద గిరిజనులకు పంచాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను కలసి వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ స్పందిస్తూ విచారించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజన ప్రజాసంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఈ భూములు తండాలో ఉన్న భూమి లేని, వలసదారులకు కేటాయిస్తే తండాలో ఉండి వ్యవసాయం చేసుకొని జీవించే అవకాశం ఉంటుందని అన్నారు. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.కోటనాయక్, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి డి.శ్రీనునాయక్, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, గిరిజన నాయకులు అంజు నాయక్, రాంబాబు నాయక్ పాల్గొన్నారు.


