
జాతీయ సమ్మెను జయప్రదం చేయండి
అద్దంకి: దేశవ్యాప్తంగా వాపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 9న తలపెట్టిన సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకుడు తిరుపతిరెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్ ఆవరణలో బుధవారం జాతీయ సమ్మె పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. సమావేశం కేఎల్‌డీ ప్రసాద్ అధ్యక్షత నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జాతీయ సమ్మెలో అన్ని ట్రేడ్ యూనియన్లు, ఎల్‌ఐసీ, కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు కలిసి సమ్మె చేస్తున్నట్లు వెల్లడించారు. కె.రఘుచంద్ మాట్లాడుతూ సమ్మెలో అందరూ పాలు పంచుకుని జయప్రదం చేయాలని కోరారు.
ఉరి వేసుకుని మహిళ మృతి
అద్దంకి రూరల్: కుటుంబ కలహాల వల్ల ఒక మహిళ ఉరివేసుకుని మృతి చెందిన సంఘటన గురువారం మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల వద్ద చోటు చేసుకుంది. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల మేరకు.. నూజిళ్ల మండలం జంగాలపల్లె గ్రామానికి చెందిన మరియకుమారి (35) అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలోని ఇటుక బట్టీల్లో పని చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ కలహాలా.. లేదా ఇతర కారణాలనే అనే విషయం తెలియాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో సీఐ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.