న్యూస్‌రీల్
మరుగుదొడ్డిలో
భద్రతపై అనుమానాలు..
విజయవాడలో శాంతి ర్యాలీ
19నుంచి మహాయజ్ఞం
విజయవాడ సిటీ
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2,100 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2720 టీఎంసీలు.
ఎన్టీఆర్ జిల్లా
బుధవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
అంబేడ్కర్ ఆశయ సాధన జగన్‌తోనే సాధ్యం
దుర్గమ్మ ఆలయ ప్రాంగణం(ఫైల్)
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో రెండో అతి పెద్ద ఆలయమైన శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో భక్తుల భద్రత గాలిలో దీపంలా మారింది. అధికారుల తీవ్ర నిర్లక్ష్యంతో ఇంద్రకీలాద్రి ప్రతిష్ట మసకబారుతోంది. పట్టించుకోవాల్సిన చంద్రబాబు సర్కారు పూర్తిగా కాడి వదిలేయడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా.. అవి వృథా అవుతున్నాయని భక్తులు మండిపడుతున్నారు. వీటికి సాక్షాలుగా ఇటీవల ఆలయ పరిసరాల్లో చోటు చేసుకున్న సంఘటనలను భక్తులు ఎత్తి చూపుతున్నారు. పోలీసు శాఖ, ఆలయ అధికారులు, పాలకవర్గం ఎవ్వరూ ఆలయ భద్రతపై దృష్టి పెట్టకుండా వారివారి ప్రయోజనాలే పరమావధిగా విధులు నిర్వర్తిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
వరుస చోరీలు..
దుర్గమ్మ ఆలయంలో ఇటీవల కుంభాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. గత నెల ఆరు నుంచి ఎనిమిదో తేదీ వరకూ జరిగిన కుంభాభిషేక మహోత్సవానికి పోలీసు శాఖ ఉన్న సిబ్బందికి అదనంగా 15 వందల మందిని నియమించింది. అన్ని వందల మంది సిబ్బంది ఉన్నప్పటికీ సరిగ్గా అమ్మవారి అంతరాలయ ఎదురుగా ఉన్న రావిచెట్టు వద్ద ఒక మహిళకు సంబంధించిన 125 గ్రాముల బంగారాన్ని ఒక మహిళ కాజేసి దర్జాగా మెట్లు దిగి వెళ్లిపోయింది. తాను బస చేసిన లాడ్జికి వెళ్లి అక్కడి నుంచి తన ఊరికి వెనుతిరిగింది. బంగారం విలువ సుమారుగా రూ.16 లక్షలుగా ఉంది. దీనిలో విశేషమేమిటంటే చోరీ జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరా పని చేయకపోవటం.
వాహనాల్లోనూ చోరీలు..
ఘాట్‌రోడ్డులో తరచూ వాహనాల్లో చోరీలు జరుగుతున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. కొద్ది మాసాల క్రితం ఘాట్‌రోడ్డులోని ఓం టర్నింగ్ పాయింట్ సమీపంలో ఒక కుటుంబం తమ కారును పార్క్ చేసి అమ్మ వారి దర్శనానికి వెళ్లింది. దర్శనం ముగించుకొని వచ్చే సరికి వారి వాహనంలో ఉండాల్సిన బ్యాగ్ మాయమైంది. అందులో బంగారం చోరీకి గురైనట్లు పోలీసు లకు ఫిర్యాదు అందింది. అక్కడ సమీపంలో ఉన్న సీసీ కెమెరా సైతం పని చేయకపోవడం గమనార్హం.
సీసీ కెమెరాలపై ఎందుకీ నిర్లక్ష్యం..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల భద్రత పూర్తిగా దిగజారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుర్గమ్మ ఆలయంలో కోట్లాది రూపాయాలు వ్యయం జరుగుతున్నప్పటికీ కనీసం ఆలయంలో సీసీ కెమెరాలు పనితీరును గాడిలో పెట్టే పరిస్థితులు లేకపోవటంపై సర్వత్రా విస్మయానికి గురవుతున్నారు. ప్రధానంగా పోలీసు శాఖ సైతం వివిధ ఉత్సవాల్లో వేలాది మందిని నియమించి వారికి అవసరమైన టీఏ, డీఏల పేరుతో ఏటా కోట్లాది రూపాయాలు తీసుకొని వెళ్తున్నారే తప్పా ఆలయంలో భక్తుల భద్రత విషయంలో శ్రద్ద చూపటం లేదంటూ ఆలయంలోని పాలకవర్గ సభ్యులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత!
7
ఉగ్రవాద సానుభూతిపరులు, వారికి మద్దతు ఇస్తున్న వ్యక్తులను ఇటీవల పోలీసు శాఖ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితులు ఉన్న నగరంలో నిత్యం లక్షలాదిగా రాకపోకలు సాగించే అమ్మవారి ఆలయ భద్రత విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండటంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఒక మహిళ విశాఖపట్నం నుంచి నగరానికి వచ్చి చక్కగా అమ్మవారి ఆలయానికి వెళ్లి దొంగతనం చేసి మళ్లీ ఆమె స్వస్థలానికి వెళ్లి పోయింది. చోరీ జరిగిన తరువాత ఆమెను పట్టుకున్నప్పటికీ అటువంటి సంఘటనలు జరగకుండా అరికట్టడంలో పోలీసు శాఖ చర్యలు లేకపోవటం, భద్రతపై చోటు చేసుకున్న నిర్లక్ష్యంపై భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల పాటు మృతదేహం ఉన్న తెలియకపోవటం వంటి సంఘటనలు ఇతర ప్రమాదకర ఘటనలకు పురిగొల్పే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం అమ్మవారి ఆలయ భద్రతపై దృష్టి పెట్టాలంటూ హితవు పలుకుతున్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ పీస్ ఫోరం మంగళవారం విజయవాడలో శాంతి ర్యాలీ నిర్వహించింది.
కోడూరు: స్థానిక ఉల్లిపాలెంలోని గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ స్వామి క్షేత్రంలో ఈ నెల 19 నుంచి 26వ తేదీ వరకు మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు.
దేవస్థానం దిగువన ఉన్న కనకదుర్గానగర్ సమీపంలో ఇటీవల ఒక మృతదేహం బయట పడింది. అక్కడ ఉన్న మరుగుదొడ్డిలో సిబ్బంది మృతదేహాన్ని చూసి ఉన్నతాధికారులకు వారి నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ మృతదేహాన్ని చూసిన తరువాత విస్మయానికి గురయ్యారు. ఎందుకంటే ఆ మృతదేహం మూడు, నాలుగు రోజుల క్రితం మృతి చెందిన వ్యక్తిది కావటం. ఇక్కడ పోలీసులు, పారిశుద్ధ్య అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు రాకపోకలు సాగించే దుర్గగుడి పరిసరాల్లో నాలుగు రోజుల పాటు ఒక మృతదేహం మరుగుదొడ్డిలో ఉన్నా తెలియకపోవటం అధికారుల పాలనతీరుకు నిదర్శనమని భక్తులు మండిపడుతున్నారు.


