సుబ్బారాయుడి ఆదాయం రూ. 9.32లక్షలు | - | Sakshi
Sakshi News home page

సుబ్బారాయుడి ఆదాయం రూ. 9.32లక్షలు

Apr 15 2026 8:50 AM | Updated on Apr 15 2026 8:50 AM

సుబ్బారాయుడి ఆదాయం రూ. 9.32లక్షలు దుర్గమ్మ నిత్యాన్నదానానికి పలువురి విరాళాలు

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారికి వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 9,32,348 ఆదాయం వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు మంగళవారం వెల్లడించారు. స్వామివారికి సేవా టికెట్ల ద్వారా రూ. 5,26,266, లడ్డూ ప్రసాదం ద్వారా రూ. 1,22,130, స్వామివారికి డొనేషన్‌ ద్వారా రూ. 2,37,792, శ్రీవారి దర్శనం ద్వారా రూ. 37,600 మొత్తం కలిపి రూ. 9,32,348 ఆదాయం వచ్చినట్లు వివరించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు మంగళవారం పలువురు భక్తులు నిత్యాన్నదాన పథకానికి విరాళాలు సమర్పించారు. హైదరాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన జి. తనూజ కుటుంబం రూ.1.01,116, విజయవాడ భవానీపురం ఆశ్రమం రోడ్డుకు చెందిన జె.సీతారామాంజనేయులు, వాసవి సౌజన్య దంపతులు రూ.1,01,116, విజయవాడ ప్రసాదం పాడుకు చెందిన జి. వెంకట రామారావు, భవ్యశ్రీ రూ.1,01,116, గుంటూరు రెడ్డిపాలెం కాలనీకి చెందిన శ్రీవెంకట రాగ సుమంత్‌, జ్ఞాన చంద్రిక రూ.1.50లక్షల విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement