చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యలపై వచ్చే ఫిర్యాదులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు పేర్కొన్నా రు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్‌లో మీ – కోసం కార్యక్రమంలో భాగంగా పలు వురు అర్జీదారులు ఇచ్చిన వినతిపత్రాలను, సమస్యలను ఆయన తెలుసుకుని సంబంధిత పోలీస్ అధికారులకు సిఫార్సు చేశారు. వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సామాన్య ప్రజలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే వివిధ సమస్యలు చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజాసమస్య లను ముఖాముఖిగా తెలుసుకుని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి పరిష్కారం అందించేందుకు జిల్లా పోలీస్‌శాఖ సిద్ధంగా ఉంటుందన్నారు. స్వీకరించిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు బదిలీ చేసి వాటిపై పూర్తి విచారణ జరిపి పరిష్కారం చూపించాల్సిందిగా ఆదేశించారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా వారికి ఎదురైన సమస్యలను పోలీసులకు తెలపాలని ఎస్పీ సూచించారు. సత్వరమే న్యాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. మీకోసంలో ఆయన 35 ఫిర్యాదులను స్వీకరించారు.
ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు


