ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ | - | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

Apr 6 2026 8:30 AM | Updated on Apr 6 2026 8:30 AM

మహనీయుల ఆశయాలు సమాజానికి మార్గదర్శకం

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): బాబూ జగ్జీవన్‌రామ్‌ వంటి మహనీయుల త్యాగాలు, ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ అన్నారు. ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన దేశ మాజీ ఉప ప్రధాని, సమతావాది బాబూజగ్జీవన్‌ రామ్‌ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌ లక్ష్మీశ.. వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు, డీవీఎంసీ సభ్యులు తదితరులతో కలిసి జగ్జీవన్‌ రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మహనీయుల జీవిత చరిత్రను చదివి అర్థం చేసుకోవాలన్నారు. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉన్నత కెరీర్‌ను సొంతం చేసుకోవాలన్నారు. మరో పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిని సొంతం చేసుకునేందుకు పారిశ్రామిక యూనిట్లు స్థాపించి, విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి కేఎల్‌ హర్షిత, జిల్లా యువజన సంక్షేమ అధికారి కొల్లేటి రమేష్‌, లిడ్‌ క్యాప్‌ డైరెక్టర్‌ పి.ఏసురత్నం, డీఐసీసీఐ ఏపీ చాప్టర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజమణి, సంఘాల నేతలు కండెల వరప్రసాద్‌, డా. దేవరాజ్‌, కేవీ నరసింహారావు, దువ్వూరి సుబ్బారావు, బాబురావు, పి.రమేష్‌, ఏఎస్‌డబ్ల్యూవో వీఎస్‌ఎస్‌ గణేష్‌ బాబు, సూపరింటెండెంట్‌ ఎన్‌.బాబురావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement