
ఉపాధ్యాయులకు బలవంతపు బదిలీలు!
పీఎస్ హెచ్‌ఎంలుగా దరఖాస్తు చేయాలని ఎస్‌ఏలకు ఒత్తిడి
మచిలీపట్నంఅర్బన్: కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ఉపాధ్యాయులను బలవంతపు బదిలీలు చేసేందుకు సిద్ధమైంది. ప్రిఫరెన్షియల్ కేటగిరీ, పీహెచ్‌సీ, విడోవర్స్, డైవోర్స్ టీచర్ల పట్ల అన్యాయం జరుగుతోంది. తాజాగా 2023లో స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతి పొందిన టీచర్లను బలవంతంగా బదిలీకి దరఖాస్తు చేయమని జాబితా విడుదల చేసింది. ఈ టీచర్లను సర్‌ప్లస్, రీ–అపార్షన్‌లో చూపించలేదు. వీరికి బదిలీలతో సంబంధమే లేదు. అయినప్పటికీ, ప్రభుత్వ నిర్ణయం మేరకు స్కూల్ అసిస్టెంట్లను హఠాత్తుగా ప్రైమరీ స్కూల్(పీఎస్) హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి చేయాలన్న యత్నం జరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బదిలీల ప్రక్రియ సంబంధించి స్పష్టమైన విధానం లేదని, బలవంతపు నిర్ణయాలు తీసుకుంటోందని ఉపాధ్యాయ సంఘాలు విమర్శిస్తున్నాయి.
దరఖాస్తు చేయాల్సిందే..
తప్పనిసరిగా పీఎస్ హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి కోసం దరఖాస్తులు చేయాలని స్కూల్ అసిస్టెంట్లను ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి కష్ణాజిల్లాలో పీఎస్ హెచ్‌ఎం పోస్టులకు సబ్జెక్టుల వారీగా 65 ఎస్‌ఏ తెలుగు, 01 ఎస్‌ఏ ఉర్దూ, 44 ఎస్‌ఏ ఇంగ్లిష్, 52 ఎస్‌ఏ గణితం, 13 ఎస్‌ఏ పీఎస్, 18 ఎస్‌ఏ బీఎస్, 37 ఎస్‌ఏ ఎస్‌ఎస్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించారు. వాటిలో స్కూల్ అసిస్టెంట్లు పీఎస్ హెచ్‌ఎం పోస్టులకు దరఖాస్తులు చేసుకునేందుకు జిల్లాలో మొత్తం 19 ఖాళీలు గుర్తించారు. అందులో జెడ్పీ/ఎంపీ పాఠశాలల్లో 06 ఎస్‌ఏ గణితం, 10 ఎస్‌ఏ సోషల్, మునిసిపల్ పాఠశాలల్లో 01 ఎస్‌ఏ గణితం, 01 ఎస్‌ఏ సోషల్, ప్రభుత్వ యాజమాన్యం పాఠశాలల్లో 01 ఎస్‌ఏ ఫిజికల్ సైన్స్ ఉన్నాయి. పీఎస్ హెచ్‌ఎం వెబ్ ఆప్షన్స్ ఆదివారం సాయంత్రంతో ముగిశాయి.
ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా..
ఉమ్మడి కృష్ణాలో స్కూల్ అసిట్టెంట్లకు.. లోకల్ బాడీస్ పాఠశాలల్లో 270 బయోలాజికల్ సైన్స్, 293 సోషల్, 521 గణితం, 8 స్పెషల్ ఏడు ఎడ్యుకేషన్, 153 ఫిజికల్ ఎడ్యుకేషన్, 317 ఫిజికల్ సైన్స్, 348 తెలుగు, 299 హిందీ, 387 ఇంగ్ల్లిష్,
4 సంస్కృతం పోస్టులు గుర్తించారు.
మునిసిపల్ పాఠశాలల్లో 6 బయోలాజికల్ సైన్స్, 5 సోషల్, 10 గణితం, 2 ఫిజికల్ ఎడ్యుకేషన్, 6 ఫిజికల్ సైన్స్, 5 తెలుగు, 7 హిందీ, 8 ఇంగ్ల్లిష్, 01 నో సబ్జెక్ట్ పోస్టులు..
మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 37 బయోలాజికల్ సైన్స్, 35 సోషల్, 57 గణితం, 17 ఫిజికల్ ఎడ్యుకేషన్, 42 ఫిజికల్ సైన్స్, 20 తెలుగు, 35 హిందీ, 51 ఇంగ్ల్లిష్, 2 సంస్కతం, 38 నో సబ్జెక్ట్ పోస్టులు
గవర్నమెంట్ పాఠశాలల్లో 10 బయోలాజికల్ సైన్స్, 13 సోషల్, 19 గణితం, 1 స్పెషల్ ఎడ్యుకేషన్, 4 ఫిజికల్ ఎడ్యుకేషన్, 16 ఫిజికల్ సైన్స్, 7 తెలుగు, 3 హిందీ, 10 ఇంగ్ల్లిష్, 1 సంస్కృతం, 1 ఉర్దూ పోస్టులకు ప్రొవిజషనల్ సీనియారిటీ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది. వెబ్ ఆప్షన్స్‌ను పీఎస్ హెచ్‌ఎం బదిలీల ప్రక్రియ అనంతరం ప్రారంభించనుంది.
సెకండరీ గ్రేడ్ టీచర్స్(ఎస్జీటీ)కు.. సంబంధించి లోకల్ బాడీస్ పాఠశాలల్లో 2,433, ప్రభుత్వ 11, మునిసిపల్ పాఠశాలల్లో 55 పోస్టులకు ప్రొవిజనల్ సీనియారిటీ జాబితా ప్రభుత్వం విడుదల చేసింది.